
వాషింగ్టన్ : New Yorkలో Mahatma Gandhi విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ నాయకులు ఖండించారు. ఈ చర్య ద్వేషనిర్మూలనకు ప్రయత్నించిన ఇద్దరు నాయకులు గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్‌లకు అగౌరవపరచడమే అని అన్నారు.
శనివారం (ఫిబ్రవరి 5, స్థానిక కాలమానం ప్రకారం) న్యూయార్క్ నగర పరిసరాల్లో మహాత్మా గాంధీ నిలువెత్తు కాంస్య విగ్రహం vandalised అయ్యింది. ఈ చర్యను భారత కాన్సులేట్ జనరల్ 'నీచమైన' చర్యగా తీవ్రంగా ఖండించింది. మాన్‌హట్టన్ యూనియన్ స్క్వేర్‌లో ఉన్న ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని న్యూయార్క్‌లోని కాన్సులేట్ తెలిపింది.
"హిందూ ధర్మాన్ని అనుసరించే ఆఫ్రికన్ అమెరికన్ అయిన నేను.. సమాజంలో ఎన్నో మంచి పెను మార్పులను ప్రేరేపించిన అహింసమిషన్‌ను ఇష్టపడతాను. అహింసామార్గాన్ని చేపట్టేలా మార్టిన్ లూథర్ కింగ్ ను ప్రేరేపించిన మహాత్మా గాంధీని ఇష్టపడతాను. ఆయన్ని ఎవరైనా అగౌరవపరిస్తే మనసు విచలితం అవుతుంది. వారు చేసిన సేవలే ప్రస్తుతం మన జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాయి’ అని Vedic Friends Association అధ్యక్షుడు బలభద్ర భట్టాచార్య దాస (బెన్నీ టిల్‌మాన్) అన్నారు.
అయితే, అమెరికాలో statues of Mahatma Gandhiని ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి కాదని హిందూపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్సవ్ చక్రబర్తి అన్నారు. "గత కొన్ని సంవత్సరాలుగా, మహాత్మా గాంధీ విగ్రహాలను రాడికల్ ఇస్లామిస్టులతో జతకట్టిన సమూహాలు, దక్షిణాసియా కమ్యూనిటీలలో వారి సానుభూతిపరులు ధ్వంసం చేశారు" అని ఆయన పేర్కొన్నారు.
నిరుడు జనవరిలో, కాలిఫోర్నియాలోని ఒక పార్కులో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, పగలగొట్టారు. అంతటితో ఊరుకోకుండా బేస్మెంట్ తో సహకా పెకిలించారు. ఇది భారతదేశం నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. దీంతో ఇంతటి "నీచమైన చర్య"కు బాధ్యులైన వారిపై సమగ్ర విచారణ, తగిన చర్య తీసుకోవాలని డిమాండర్లు వెల్లువెత్తాయి.
డిసెంబర్ 2020లో, ఖలిస్తానీ-మద్దతుదారులు వాషింగ్టన్, DCలోని భారత రాయబార కార్యాలయం ముందు గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేశారు. అలాగే జూన్ 2020లో, కొంతమంది గుర్తు తెలియని దుండగులు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెలుపల గాంధీ విగ్రహాన్ని గ్రాఫిటీ, స్ప్రే పెయింటింగ్‌తో ధ్వంసం చేశారు. అంతేకాకుండా స్థానిక చట్ట అమలు సంస్థలకు ఫిర్యాదు చేయాలని, కేసు నమోదు చేయమని మిషన్‌ను ప్రేరేపించారు.
American Hindus Against Defamation (AHAD) కన్వీనర్ అజయ్ షా గాంధీ ఒక ప్రకటన ఇస్తూ.. గాంధీజీ, ఆయన నాయకత్వం వహించిన స్వాతంత్ర్య ఉద్యమాలే.. అమెరికన్ పౌర హక్కుల ఉద్యమానికి ప్రేరణగా నిలిచాయని అన్నారు. "అట్లాంటాలోని MLK మెమోరియల్ ఉన్న GAలో మహాత్మా గాంధీకి అంకితం చేయబడిన స్థలం ఉంది. బ్లాక్ హిస్టరీ మంథ్ లో గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేయడం యాదృచ్చికం కాదు. ఈ చర్యకు పాల్పడినవారు, వారిని స్పాన్సర్ చేసినవారు శాంతి, మానవ హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం మానవులందరి సమానం అనేదాన్ని అంగీకరించడం లేదనే సందేశాన్ని పంపుతున్నారు” అని షా అన్నారు.
భారత్ తరువాత అత్యధిక సంఖ్యలో గాంధీ విగ్రహాలు USలోనే ఉన్నాయి. ‘‘న్యూయార్క్‌లో జరిగిన ఈ విధ్వంసం విషయంలో తక్షణ విచారణ కోసం US స్టేట్ డిపార్ట్‌మెంట్ సీరియస్ గా తీసుకుంది. ఈ నీచమైన చర్యకు బాధ్యులైన వారిపై తగిన చర్య తీసుకోవాలని కోరింది" అని కాన్సులేట్ పేర్కొంది.