5 రోజుల పాటు అడవిలో నరకం.. మహిళ ప్రాణాలు నిలిపిన లాలిపాప్స్‌, వైన్ !

By Rajesh Karampoori  |  First Published May 10, 2023, 2:45 AM IST

ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ అడవుల్లో కనిపించకుండా పోయింది. ఐదు రోజుల తర్వాత పోలీసులు ఆమెను గుర్తించారు. నివేదిక ప్రకారం.. ఆమె కారులో తెచ్చుకున్న లాలిపాప్స్‌, వైన్‌ ఆకలి తీర్చాయి. కేవలం వీటి మీదే ఆమె ఐదు రోజులు బతికింది. 


నేటి కాలంలో Google Maps చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. దాని సహాయంతో మనకు తెలియని ప్రదేశాల్లో సులభంగా సందర్శించవచ్చు. అయితే.. కొన్ని సార్లు నెట్‌వర్క్ పనిచేయకపోవడం, ఫోన్ లో బ్యాటరీ నిల్ కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పరిస్థితిలో తెలియని ప్రదేశాల్లో ప్రయాణం చేయడం కష్టమే. ఏదో ధైర్యం చేసి.. ముందుకు సాగితే.. దారి తప్పిపోయే ప్రమాదముంది. తాజాగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఓ మహిళ విషయంలోనూ అలాంటిదే జరిగింది. 

ఆమె తన కారులో తనకు తెలియని ప్రదేశానికి బయలుదేరింది.కానీ, ఆమె దారి తప్పి దట్టమైన అడవులకు చేరుకుంది. ఆమె మొబైల్ నెట్‌వర్క్ పని చేయకపోవడంతో అడవిలో చిక్కుకుపోయింది. ఐదు రోజుల పాటు నరకయాతన అనుభవించింది.  ఎటు వెళ్లాలో దారి తెలీక, ఏం చేయాలో అర్థం కాక అల్లాడిపోయింది. తినడానికి ఏమి లభించని అడవిలో లాలిపాప్స్‌, వైన్‌ ఆమె ప్రాణాలు నిలిపాయి. ఐదు రోజుల పాటు ఆమె ఆకలిదాపికలను తీర్చాయి. ఒకరకంగా చెప్పాలంటే.. లాలిపాప్స్‌, వైన్‌ లే ఆమె ప్రాణాలను కాపాడాయి. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. 

Latest Videos

undefined

 వెబ్‌సైట్ న్యూయార్క్ పోస్ట్‌లోని  నివేదిక ప్రకారం.. ఆ మహిళ పేరు లిలియన్. 48 ఏళ్ల లిలియన్ ఒక రోజు పర్యటనకు వెళ్లింది. ఆమె విక్టోరియాలోని హై కంట్రీకి కారులో ప్రయాణించింది. అయితే.. దారిలో విశాలమైన, దట్టమైన అడవి ఉండడం. ఆ దారిలో మనుషులు రావడం వంటి విషయాలను గమనించింది. దీంతో ఆమెకు అర్థమైంది తాను దారి తప్పిపోయానని.  ఆ సమయంలో ఆమెకు మార్గదర్శనం చేసేవారు లేరు. అయితే తాను రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నానని గుర్తించిన ఆమె కారును వెనక్కి తిప్పే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో కారు పొదల మధ్య బురదలో కూరుకుపోయింది. ఇతరులను సహయం కోరుదామని భావించినా..  లిలియన్ మొబైల్‌లో నెట్‌వర్క్ కూడా లేదు. కాస్తా ధైర్యం చేసి.. నడుచుకుంటూ సహాయం కోసం రాసాగింది. కానీ సరైన మార్గాన్ని కనుకోలేకపోయింది. దాదాపు ఐదు రోజుల పాటు అడవిలోనే ఉండిపోయింది. తినడానికి తిండి లేకుండా అల్లాడిపోయింది

ఇంతలో ఆమె అదృశ్యంపై తన  కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను వెతకడం ప్రారంభించారు. తొలి రోజు పోలీసులు హెలికాప్టర్ సాయంతో అడవిలోని ప్రతి మూలను వెతికినా లిలియన్ ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత ఒకరోజు ఎయిర్ వింగ్ కొండ ప్రాంతంలో హఠాత్తుగా ఓ కారు కనిపించింది. దీంతో లిలియన్ సమీపంలోనే ఉండి ఉండవచ్చని పోలీసులు భావించారు. దీంతో సహయక చర్యలను మూమ్మరం చేశారు. మరోసారి రెస్క్యూ సిబ్బంది అడవిలో హెలికాఫ్టర్‌తో వెతులాట ప్రారంభించింది. ఎట్టకేలకు ఆమెను కనిపెట్టి.. రక్షించారు. 

ఐదు రోజులు ఎలా గడిపారని పోలీసులు ప్రశ్నించగా.. తాను లాలీపాప్‌లు తినడం , మద్యం సేవించడం ద్వారా ఇన్ని రోజులు జీవించానని, అయితే ఇంతకు ముందు తాను ఎప్పుడూ మద్యం సేవించలేదని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

click me!