పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

By Siva KodatiFirst Published May 9, 2023, 3:14 PM IST
Highlights

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణలపై ఆయనను ఆ దేశ ఆర్మీ అదుపులోకి తీసుకుంది.

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణలపై ఆయనను ఆ దేశ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఇమ్రాన్‌పై 85కు పైగా కేసులు వున్నాయి. 2018 ఆగస్ట్ నుంచి 2022 ఏప్రిల్ వరకు పాకిస్తాన్ ప్రధానిగా ఆయన వ్యవహరించారు. ఈ క్రమంలో మార్చి 7న ఇమ్రాన్ అరెస్ట్‌కు ఇస్లామాబాద్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. ఆయనను అదుపులోకి తీసుకున్న ఆర్మీ.. రహస్య ప్రాంతానికి తరలించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

పీటీఐ కార్యకర్త అలీ బిలాల్ అలియాస్ జిల్లే షా రోడ్డు ప్రమాదంలో హత్యకు గురైన కేసులో లాహోర్ పోలీసులు ఇమ్రాన్ ఖాన్ పై ఈ ఏడాది మార్చిలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. షా హత్య కేసులో ఖాన్ తో పాటు మరో 400 మందిపై లాహోర్ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. 11 నెలల క్రితం పీఎంఎల్-ఎన్ నేతృత్వంలోని ఫెడరల్ సంకీర్ణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనపై నమోదైన 81వ ఎఫ్ఐఆర్ ఇది. అంతేకాదు.. మార్చి 15న ఇమ్రాన్ ఖాన్‌ నివాసాన్ని పోలీసులు, సైన్యం చుట్టుముట్టడంతో ఆయన అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న ఆయన మద్ధతుదారులు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. 

click me!