తన రహస్యం తల్లికి తెలిసిపోయిందన్న కారణంతో అత్యంత దారుణంగా పాన్ తో దాడిచేసి, ఆ తరువాత కత్తితో 30సార్లు పొడిచి హత్య చేసిందో కూతురు.
అమెరికా : ఓహియోకు చెందిన 23 ఏళ్ల మహిళ తన తల్లిని ఇనుప స్కిల్లెట్‌తో కొట్టి, మెడపై దాదాపు 30 సార్లు పొడిచి చంపింది. ఇంత దారుణానికి ఒడిగట్టడం వెనుక కారణం ఏంటంటే.. తనను కాలేజీ నుంచి తీసేశారన్న విషయం తల్లికి తెలియడమేనని తేలింది.
సమ్మిట్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకారం, అక్రోన్‌కు చెందిన సిడ్నీ పావెల్ హెల్త్ కేర్ వర్కర్ అయిన బ్రెండా పావెల్ (50) అత్యంత క్రూరమైన రీతిలో హత్యకు గురైంది. ఆమె మీద దారుణమైన దాడి జరిగింది. ఆ తరువాత సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి నేరాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ఆమె కూతురైన 23 యేళ్ల మహిళ హస్తం ఉన్నట్లు తేలింది.
"మార్చి 2020లో, సిడ్నీ పావెల్ బ్రెండా పావెల్ తలపై ఇనుప స్కిల్లెట్‌తో కొట్టింది. ఆ తరువాత ఆమె మెడ మీద దాదాపు 30 సార్లు పొడిచింి" అని సమ్మిట్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మౌంట్ యూనియన్ యూనివర్శిటీ మాజీ విద్యార్థి అయిన పావెల్ బుధవారం దోషిగా నిర్ధారించబడిన తర్వాత సమ్మిట్ కౌంటీ కామన్ ప్లీస్ కోర్ట్‌రూమ్‌లో ఏడ్చినట్లు అక్రోన్ బీకాన్ జర్నల్ నివేదించింది.
చైనాలో మరో కరోనా మహమ్మారి విజృంభించవచ్చు - ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ షి జెంగ్లీ హెచ్చరిక
మార్చి 3, 2020న, బ్రెండా తన స్కడర్ డ్రైవ్ ఇంట్లో తీవ్ర గాయాలతో పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను అక్కడినుంచి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, అక్రోన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చైల్డ్ లైఫ్ స్పెషలిస్ట్ అయిన బాధితురాలు తన అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు పావెల్ తన తల్లిపై దాడి చేసింది.
పావెల్ స్కిజోఫ్రెనియాతో బాధపడుతుందని,, అందువల్ల హత్యకు ఆమెను బాధ్యురాలిగా చెప్పలేమని డిఫెన్స్ వాదించింది. దీనిమీద ఆమెకు రోగనిర్ధారణ చేయడానికి ముగ్గురు డిఫెన్స్ నిపుణులను నియమించారు. వారిలో ఒకరైన జేమ్స్ రియర్డన్, సిడ్నీ తన బెస్ట్ ఫ్రెండ్‌గా భావించే తన తల్లిని చంపిన తరువాత మానసిక అసమతుల్యతకు గురయ్యిందని చెప్పారు.
సిల్వియా ఓబ్రాడోవిచ్, ప్రాసిక్యూటర్లు నియమించిన మనస్తత్వవేత్త రోగనిర్ధారణతో ఏకీభవించలేదు. నేరం జరిగిన సమయంలో పావెల్ పిచ్చితనం చట్టపరమైన నిర్వచనాన్ని అందుకోలేదని చెప్పారు. ఓబ్రాడోవిచ్ పావెల్ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని అంగీకరించారు, ఇందులో బార్డర్ లైన్ వ్యక్తిత్వ లక్షణాలు, మలింగరింగ్, ఆందోళన రుగ్మత ఉన్నాయి.
కోర్టులో జరిగిన సంఘటనను వివరిస్తూ, అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ బ్రియాన్ స్టానో, "సిడ్నీ మొదట తల్లిమీద పాన్‌తో దాడి చేసింది. ఆ తరువాత.. వంటింట్లోకి వెళ్లి కత్తితో తిరిగొచ్చి ఉండవచ్చు" అని అక్రోన్ బీకాన్ జర్నల్ అభిప్రాయపడింది. "ఆమె ఆయుధాలు మార్చుకుని, తల్లిపై దాడి చేసింది" అని స్టానో జోడించారు.
"కేవలం కత్తితో మెడ మీద అనేకసార్లు పొడవడం అనేది.. ఉద్దేశపూర్వకంగా చేసినట్టు ఉంది. ఆమెను ఎలాగైనా అంతం చేయడానికి ప్రయత్నించినట్టు ఉంది’’ అని స్టానో అన్నారు.