ఆ గొడవ ఎంత దూరం వెళ్లిందంటే... ఒకరిపై మరొకొరు పెప్పర్ స్ప్రే కొట్టుకునేదాకా వెళ్లింది. ఈ సంఘటన ఢిల్లీ మెట్రో రైలులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇద్దరు మహిళలు గొడవ పడటానికి పెద్ద గా గొడవలు అవసరం లేదు. సీటు కోసం కూడా గొడవ పడగలరు. ఆ గొడవను ఎంత దూరమైనా తీసుకువెళ్లగలరు. తాజాగా ఇద్దరు మహిళలు కేవలం సీటు కోసం గొడవ పడ్డారు. ఆ గొడవ ఎంత దూరం వెళ్లిందంటే... ఒకరిపై మరొకొరు పెప్పర్ స్ప్రే కొట్టుకునేదాకా వెళ్లింది. ఈ సంఘటన ఢిల్లీ మెట్రో రైలులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hi. Please provide coach number. Coach number is mentioned inside and outside the train. Please refer to the images attached. pic.twitter.com/DVvf5E2HY7
— Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC)
undefined
ఇప్పుడు ఢిల్లీ మెట్రో కోచ్‌లో ఇద్దరు మహిళల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వీడియో వైరల్ గా మారింది. వీడియోలో ఇద్దరు మహిళలు సీట్ల కోసం కొట్టుకోవడం స్పష్టంగా కనపడుతుంది. ఎరుపు రంగు సల్వార్ సూట్ ధరించిన మహిళ అదే వరుసలో కూర్చున్న మరో మహిళపై అరవడంతో క్లిప్ ప్రారంభమవుతుంది. ఎరుపు రంగు సూట్ ధరించి ఉన్న స్త్రీ గట్టి గట్టిగా అరుస్తోంది. పెప్పర్ స్ప్రేతో తనపై దాడి చేయమని ఆమె సహ ప్రయాణీకురాలిని కూడా బెదిరించింది. అవతలి స్త్రీ తిరిగి మాట్లాడటానికి ప్రయత్నిస్తుండగా, ఆమె ఒక సీసా తీసి పెప్పర్ స్ప్రేని ఉపయోగిస్తుంది. ఆమె పెప్పర్ స్ప్రే ఎఫెక్ట్ తో... ఆ కోచ్ లో ఉన్నవారందరూ దగ్గుతో ఇబ్బంది పడ్డారు.
ఈ వీడియోకు అనేక స్పందనలు రావడంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కూడా స్పందించింది “హాయ్. దయచేసి కోచ్ నంబర్‌ను అందించండి. రైలు లోపల , వెలుపల కోచ్ నంబర్ ఉంటుంది, ”అని వారు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.