ఆఫ్ఘనిస్తాన్: షియాలే టార్గెట్ , మసీదులో మళ్లీ బాంబు పేలుళ్లు.. ఏడుగురి మృతి..?

Siva Kodati |  
Published : Oct 15, 2021, 03:47 PM IST
ఆఫ్ఘనిస్తాన్: షియాలే టార్గెట్ , మసీదులో మళ్లీ బాంబు పేలుళ్లు.. ఏడుగురి మృతి..?

సారాంశం

తాలిబన్ల (talibans) పాలనలో ఆఫ్ఘనిస్తాన్ (afghanistan) మరోసారి బాంబు పేలుళ్లతో (bomb blast) దద్దరిల్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కాందహార్‌లోని (Kandahar ) షియా (mosque) ముస్లింలు ప్రార్థనలు జరుపుతున్న మసీదును (mosque) లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుళ్లకు తెగబడ్డారు. 

తాలిబన్ల (talibans) పాలనలో ఆఫ్ఘనిస్తాన్ (afghanistan) మరోసారి బాంబు పేలుళ్లతో (bomb blast) దద్దరిల్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కాందహార్‌లోని (Kandahar ) షియా (mosque) ముస్లింలు ప్రార్థనలు జరుపుతున్న మసీదును (mosque) లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుళ్లకు తెగబడ్డారు. ఈ ఘటనలో భారీగానే క్షతగాత్రులు అయ్యుంటారని సమాచారం. 

కాగా, ఈ నెల 8న కుందుజ్ రాష్ట్రంలో ఓ మసీదులోనూ భారీ బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం కావడంతో జనం పెద్ద ఎత్తున ప్రార్థనలకు రాగా, ప్రాణ నష్టం కూడా అదే స్థాయిలో జరిగింది.  అంతర్జాతీయ మీడియా వెల్లడిచిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య 50 దాటగా, అఫ్గాన్ స్థానిక మీడియా మాత్రం మరణాల సంఖ్య 100కుపైగా ఉండొచ్చని తెలిపింది. గాయపడ్డవారి సంఖ్య కూడా వందల్లో ఉన్నట్లు సమాచారం. 

ALso Read:ఆఫ్ఘనిస్తాన్: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్‌.. 14 మంది మృతి

దేశ పాలనపగ్గాలు తాజాగా చేపట్టిన తాలిబన్లకు ఈ వరుస పేలుళ్లు సవాలుగా మారాయి. తాలిబన్లు షియాలకు రక్షణ ఇవ్వాలని ఆ మత పెద్దలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రార్ధనాస్థలాల రక్షణకు ఉంచిన ఆయుధాలను తాలిబన్లు తీసుకుపోయినందున, వీటిని రక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్లదేనంటున్నారు. కాగా, అమెరికా సైన్యాలు వైదొలిగిన అనంతరం ఐసిస్‌ (isis) ఉగ్రవాదులు అఫ్గాన్‌లో దాడులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా షియాలపై ఐసిస్‌–కే యుద్ధాన్నే ప్రకటించింది. ఒకప్పుడు కొన్నిప్రాంతాలకే పరిమితమైన ఐసిస్‌ దాడులు ఇప్పుడు పలు చోట్ల జరగడం తాలిబన్లతో పాటు అఫ్గాన్‌ పొరుగుదేశాలను కూడా కలవరపరుస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !