స్వయంపాలిత తైవాన్‌పై చైనా దాడిచేస్తే అమెరికా వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. చైనా దాడి చేస్తే తాము తప్పకుండా తైవాన్‌కు అండగా నిలుస్తామని పరోక్షంగా డ్రాగన్ కంట్రీకి వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఈ వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలతో చైనా-అమెరికాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు Joe Biden సంచలన వ్యాఖ్యలు చేశారు. Chinaకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. Taiwanపై దాడి చేస్తే తాము ఊరుకోబోమని, తైవాన్‌కు అండగా నిలుస్తామని వివరించారు. ఇటీవలే స్వయంపాలిత తైవాన్‌పై చైనా కవ్వింపులకు దిగుతున్నది. చైనా విమానాలు తైవాన్ గగనతలంలో చక్కర్లుకొట్టాయి. వీటిపై తైవాన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, ఏదో ఒక రోజు కచ్చితంగా తైవాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుంటామని చైనా తరుచూ ప్రకటిస్తున్నది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకోవడానికి తైవాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ తరుణంలో America అధ్యక్షుడు తైవాన్‌కు అండగా ప్రకటన చేశారు.
సీఎన్ఎన్ టౌన్ హాల్‌లో జో బైడెన్ మాట్లాడుతుండగా విలేకరులు ప్రశ్నలు వేశారు. తైవాన్‌పై చైనా దాడికి దిగితే అమెరికా వైఖరి ఎలా ఉంటుందని, తైవాన్‌కు మద్దతునిస్తారా? అనే ప్రశ్న అడిగారు. దీనికి జో బైడెన్ సానుకూలంగా స్పందించారు. తాము తైవాన్‌కు అండగా నిలుస్తామని బైడెన్ స్పష్టం చేశారు. తైవాన్‌కు సహాయం చేస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. తైవాన్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి తాము మద్దతిస్తామని అమెరికా విధానాలు స్పష్టం చేశాయి. కానీ, యుద్ధం ఏర్పడితే తాము హెల్ప్ చేస్తామని హామీనివ్వలేదు.
undefined
Also Read: భారత్‌లోనూ బైడెన్‌లున్నారు.. నాకు లేఖ రాశారు.. మోడీ భేటీలో యూఎస్ అధ్యక్షుడి సరదా సంభాషణ
జో బైడెన్ ప్రకటనపై తైవాన్ స్పందించింది. అమెరికా బలమైన హామీకి కట్టుబడి ఉండటం సంతోషకరమని తైవాన్ అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి జేవియర్ చాంగ్ వివరించారు.
కాగా, చైనా కూడా జో బైడెన్ ప్రకటనపై తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ప్రకటనలతో చైనా-అమెరికా బంధాలను దెబ్బతింటాయని పేర్కొంది. తైవాన్‌పై అమెరికా జాగ్రత్తగా స్పందించాలని హెచ్చరించింది. తైవాన్ గురించి మాట్లాడేటప్పుడు ఆచీతూచీ మాట్లాడాలని సూచించింది. చైనా తన ప్రయోజనాల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలను చైనా సార్వభౌమత్వానికి భంగకరమైనవిగా పరిగణిస్తామని పేర్కొంది.