
న్యూఢిల్లీ: అమెరికా వ్యాప్తంగా వందలాది మంది జ్వరం బారినపడ్డారు. ఈ అనారోగ్యాని కారణంగా భావిస్తున్న ఉల్లిగడ్డలను వాడరాదని, ఉంటే వాటిని పడేయాలని అమరికా ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని మొత్తం 37 రాష్ట్రాల్లో ఈ ఫీవర్ రిపోర్ట్ అయింది.
మెక్సికోలోని చిహువాహువా నుంచి దేశంలోకి దిగుమతి అయిన onionsకు ఈ వింత రోగానికి సంబంధమున్నట్టు అనుమానిస్తున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) అండ్ ప్రివెన్షన్ ఈ మేరకు వివరించింది. ఈ ఉల్లిగడ్డలను ప్రోసోర్స్ ప్రొడ్యూస్ ఎల్ఎల్‌సీ పంపిణీ చేసింది.
America వ్యాప్తంగా కనీసం 652 మంది జ్వరం బారిన పడ్డారు. ఇందులో 129 మంది హాస్పిటల్‌లో చేరినట్టు సమాచారం. ఇప్పటి వరకు మరణాలు చోటుచేసుకోలేదు. నిజానికి ఈ జ్వరం బారిన పడ్డ వారి సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశమున్నది. ఎందుకంటే అన్ని కేసులను రిపోర్ట్ చేయడం సాధ్యం కావడం లేదు.
Also Read: చిన్నప్పటి నుంచి కన్ను మూసిందే లేదు.. ఆ మహిళ వింత ప్రవర్తనతో వైద్యులకు షాక్
ఈ జ్వరం బారిన పడ్డవారితో మాట్లాడితే కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్ట్ చేసిన వారిలో 75శాతం మంది ఉల్లిగడ్డలు, లేదా ముడి ఉల్లిగడ్డలు లింక్ ఉన్న వంటలను తిన్నట్టు తెలిసింది. ఈ Raw ఆనియన్స్ తిన్న తర్వాతే జ్వరం బారిన పడ్డట్టు వెల్లడించారు. అంతేకాదు, ఇందులోనూ చాలా మంది ఒకే రెస్టారెంట్‌లో తిన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వీరి జ్వరానికి ఉల్లిగడ్డలు సంబంధముండే అవకాశముందని సీడీసీ వివరించింది.
దీంతో చిహువాహువా నుంచి దిగుమతి అయిన ఉల్లిగడ్డలను వాడవద్దని సీడీసీ అమెరికా వాసులను సూచనలు చేసింది. లేబుల్స్ లేని ఉల్లిగడ్డలను వినియోగించవద్దని తెలిపింది. లేదంటే ఉల్లిగడ్డలను మంచిగా శుభ్రం చేసిన తర్వాతే తినాలని పేర్కొంది. ఈ ఉల్లిగడ్డలు తిన్న తర్వాత వారందరికీ సాల్మొనెల్లా సోకినట్టు తెలిపింది. సీడీసీ అధికారులతో కలిసి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ ఘటనలపై దర్యాప్తు ప్రారంభించింది.