నేడు లండన్ జైల్లో ప్రియురాలిని పెళ్లాడనున్న అసాంజే...

Published : Mar 23, 2022, 08:57 AM IST
నేడు లండన్ జైల్లో ప్రియురాలిని పెళ్లాడనున్న అసాంజే...

సారాంశం

వికీలిక్స్ వ్యవస్థాపకుడు అసాంజ్ ఒకింటివాడు కానున్నాడు. తన చిరకాల ప్రేయసి స్టెల్లా మోరిస్ ను జైల్లోనే వివాహం చేసుకోనున్నాడు. కొద్దిమంది అతిథుల సమక్షంలో విజిటింగ్ అవర్స్ లో బుధవారం ఈ వివాహం జరగనుంది. 

లండన్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు Julian Assange తన చిరకాల ప్రేయసి Stella Morisను బుధవారం ఆగ్నేయ లండన్‌లోని హై-సెక్యూరిటీ జైలులో నలుగురు అతిథులు, ఇద్దరు అధికారిక సాక్షులు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో ఏర్పాటుకానున్న చిన్న వేడుకలో సింపుల్ గా marriage చేసుకోనున్నారు.

అసాంజే యుఎస్ అధికారుల వాంటెడ్ లిస్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే.  వికీలీక్స్ పేరిట U.S. మిలిటరీ రికార్డులు, దౌత్య పరమైన విషయాలను విడుదల చేసిన అంశానికి సంబంధించి 18 counts పై విచారణను ఎదుర్కోవాల్సి ఉందని U.S. అధికారులు చెబుతున్నారు. అయితే వాటిలో తాను ఎటువంటి తప్పు చేయలేదని 50 ఏళ్ల అసాంజే తిరస్కరించారు. అసాంజే 2019 నుండి బెల్మార్ష్ జైలులో ఉన్నాడు. అంతకు ముందు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఏడు సంవత్సరాలు ఉన్నారు.

రాయబార కార్యాలయంలో ఉన్న సమయంలో తన న్యాయవాది అయిన మోరెస్ తో అతను ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ సహజీవనానికి గుర్తుగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మోరెస్ అసాంజే కంటే వయసులో పదేళ్లు చిన్నది. 2011లో ఆమె అసాంజె న్యాయ బృందంలో పని చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే అసాంజె ఆమెను కలుసుకున్నాడు. ఆ తరువాత 2015 లో వారి సంబంధం ప్రారంభమైంది.

ఈ వివాహం రిజిస్ట్రార్ నేతృత్వంలో జరగనుంది. జైలు విజిటింగ్ అవర్స్ లో ఈ పెళ్లి జరుగుతుంది. ఈ జైలులో బ్రిటన్ లోని ఎంతోమంది నోటోరియస్ క్రిమినల్స్ శిక్ష అనుభవించారు. వీరిలో బాలల హంతకుడు ఇయాన్ హంట్లీతో సహా పలువురు ఉణ్నారు.

పెళ్లి సమయంలో మోరిస్ వేసుకునే దుస్తులు, అస్సాంజ్ ధరించే కిల్ట్ లను బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్ తయారు చేశాడు. అతను గతంలో అసాంజ్ అప్పగింతకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. అసాంజేను అమెరికాకు అప్పగించే నిర్ణయానికి వ్యతిరేకంగా బ్రిటన్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేయడానికి ఈ నెలలో అనుమతి నిరాకరించబడింది. అతని అప్పగింతను ఆమోదించడానికి ప్రభుత్వం నుండి ఏ నిర్ణయాన్ని అయినా అతను ఇప్పటికీ సవాలు చేయవచ్చు.

ఇదిలా ఉండగా, నిరుడు నవంబర్ లో బెయిల్ నిబంధనల ఉల్లంఘన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు భాగస్వామి స్టెల్లా మోరిస్ ను కారాగారంలోనే వివాహం చేసుకునేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతించింది. వివాహ తేదీ మీద ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. 

లండన్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న సమయంలో Julian Assange తన న్యాయవాదులలో ఒకరైన స్టెల్లా మోరిస్ తో ప్రేమలో పడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతేడాది ఏప్రిల్ లో అసాంజే-మోరిస్ జంట తమ బంధాన్ని బయటపెట్టింది. 

ఈ ఏడాది జనవరిలో jailలో వివాహం చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా కు చెందిన అసాంజే WikiLeaks లో అమెరికా రహస్య సమాచారాన్ని బయటపెట్టారు. ఆ దేశం నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో లండన్ లోని Embassy of Ecuadorలో కొంతకాలం ఆశ్రయం పొందారు. ఈక్వెడార్ ఆశ్రయాన్ని విరిమించుకున్న తర్వాత బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2019నుంచి లండన్ లోని జైలులో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే