అప్పుడు దేశ వ్యవస్థను శాసించే ఆర్థిక మంత్రి.. ఇప్పుడు క్యాబ్ డ్రైవ‌ర్‌ !

Published : Mar 22, 2022, 01:31 PM IST
అప్పుడు దేశ వ్యవస్థను శాసించే ఆర్థిక మంత్రి.. ఇప్పుడు క్యాబ్ డ్రైవ‌ర్‌ !

సారాంశం

Afghanistan: తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ త‌ర్వాత ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన చాలా మంది నేత‌లు, ప్ర‌భుత్వ అధికారులు ఇత‌ర దేశాల‌కు పారిపోయి అక్క‌డ ఆశ్ర‌యం పొందుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ దేశ మాజీ ఆర్థిక మంత్రి ఖ‌లీద్ పయెండా ప్రస్తుతం అమెరికాలో ఉబర్ డ్రైవ‌ర్ గా పేనిచేస్తున్నాడు.   

Afghanistan: ఒక‌ప్పుడు ఆయ‌న ఒక దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను శాసించే  నాయ‌కుడు. బిలియ‌న్ డాల‌ర్ల బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టిన ఆర్థిక మంత్రి. కానీ ఇప్పుడు క్యాబ్ డ్రైవ‌ర్ గా మారాడు. త‌న కుటుంబాన్ని పోషించ‌డానికి అమెరికాలో ఉబ‌ర్ డ్రైవ‌ర్ గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. అయ‌నే ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఆర్థిక మంత్రి ఖ‌లీద్ పయెండా. 

వివ‌రాల్లోకెళ్తే.. ఒకప్పుడు కాబూల్ లో నివాస‌ముంటూ.. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక మంత్రిగా 6 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను పర్యవేక్షించి సమర్పించిన ఖలీద్ పయెండా ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించడానికి అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉబర్ డ్రైవర్‌గా ప‌నిచేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు మధ్యలో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్ర‌భుత్వంపై తిరుగుబాటు చేసి.. అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, తాలిబ‌న్ల చ‌ర్య‌ల‌కు భ‌య‌ప‌డి.. చాలా మంది అక్క‌డి నుంచి వేరే దేశాల‌కు వ‌ల‌స వెళ్లారు. అందులో అప్ప‌టి ఆఫ్ఘనిస్తాన్ ప్ర‌భుత్వ నేత‌లు, మంత్రులు, అధికారులు, స‌మాన్య ప్ర‌జ‌లు ఉన్నాయి. 

ఈ నేప‌థ్యంలోనే  ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఆర్థిక మంత్రి ఖ‌లీద్ పయెండా అమెరికాకు వ‌ల‌స వెళ్లారు. యూఎస్ లో ఆశ్ర‌యం పొందుతున్న ఆయ‌న  త‌న కుటుంబ సోష‌ణ కోసం ఉబెర్ డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు గురించి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... "ఆరు గంటల పనికి 150 డాలర్ల కంటే కొంచెం ఎక్కువ సంపాదిస్తున్నాన‌ని చెప్పాడు. తాలిబ‌న్ల చర్య‌ల కార‌ణంగా దారుణ ప‌రిస్థితులు ఎద‌ర్కొన్నామ‌ని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుత పరిస్థితికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే కార‌ణ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఎందుకంటే దళాల ఉపసంహరణ తాలిబాన్లను దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనుమతించిందని ఆరోపించారు. 

కాగా, ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక మరియు మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా మద్దతు ఉన్న పాలనను పడగొట్టిన తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వెనుకాడుతున్నాయి. ప్రధానమంత్రి అష్రఫ్ ఘనీతో సంబంధాలు తెగిపోవడంతో తాలిబాన్లు రాజధాని నగరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి వారం రోజుల ముందు పయెండా దేశ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆగస్టు 10న తిరిగి ట్వీట్ చేస్తూ “ఈరోజు నేను తాత్కాలిక ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశాను. MoFకి నాయకత్వం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవం, కానీ వ్యక్తిగత ప్రాధాన్యతలకు హాజరయ్యేందుకు పదవీ విరమణ చేయాల్సిన సమయం వచ్చింది అని తెలిపారు.  ఇక తాలిబ‌న్ ప్రభుత్వం అరెస్టు చేస్తుందనే భయంతో అతను ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచిపెట్టాడు.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తన కుటుంబంతో ఆశ్ర‌యం పొందుతున్నాడు.

 

PREV
click me!

Recommended Stories

Most Dangerous Lake : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరస్సు.. దిగితే ప్రాణాలు పోవడం ఖాయం!
World Coldest Place : ఫ్రిజ్‌లో ఉన్నట్టే.. ప్రపంచంలోనే అత్యంత కూలెస్ట్ ప్లేస్ ఇదే గురూ !