టాయ్ లెట్ క్లీన్ చేసే బ్రష్.. రూ.45వేలు.. ప్రధాని రాజీనామాకు నిరసనలు

By telugu news teamFirst Published Feb 1, 2021, 10:42 AM IST
Highlights

ప్రభుత్వం అరెస్టు చేసిన ప్రతిపక్ష నేత  నావల్నీని విడుదల చేయాలని, అధ్యక్ష పదవికి పుతిన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ రష్యాలో వేలాదిమంది ఆదివారం నిరసనల బాట పట్టి, వీధుల్లో కదం తొక్కారు. 

టాయ్ లెట్ కడిగేందుకు ఉపయోగించే బ్రష్.. దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటుంది. అయితే.. ఈ బ్రష్ మాత్రం అలాంటి ఇలాంటి బ్రష్ కాదు. ఎందుకంటే.. దాని విలువ రూ.45వేలు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఓ విలాసవంతమైన భవనం ఉంది.. ఆ దేశ ప్రతిక్షాలు ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి. ఆ భవనం ఖరీదదు రూ.9800కోట్లు కాగా.. అందులో టాయ్ లెట్ కి ఉపయోగించే బ్రష్ ఖరీదు రూ.45వేలు కావడం గమనార్హం.

ఓవైపు దేశ ప్రజలు దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతుంటే, పుతిన్‌ అవినీతి ఈస్థాయిలో ఉండటంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం అరెస్టు చేసిన ప్రతిపక్ష నేత  నావల్నీని విడుదల చేయాలని, అధ్యక్ష పదవికి పుతిన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ రష్యాలో వేలాదిమంది ఆదివారం నిరసనల బాట పట్టి, వీధుల్లో కదం తొక్కారు. 

రాజకీయ ఖైదులను పరిశీలించే ఓవీడీ-ఇన్ఫో అనే సంస్థ నివేదిక ప్రకారం.. నావల్నీకి మద్దతుగా నిరసనలు నిర్వహిస్తున్న 4000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలు శిక్షలు విధిస్తామన్న హెచ్చరికలు, భారీ స్థాయిలో బలగాల మోహరింపు కూడా వారిని అడ్డుకోలేకపోయాయి. మా స్కోలో అయితే లాక్‌డౌన్‌ పరిస్థితి నెలకొంది. 

బస్సుల్ని, రైళ్లను నిలిపేశారు. దొరికినవారిని దొరికినట్లు అరెస్టు చేశారు. అయినప్పటికీ వందలాదిమంది ర్యాలీలో పాల్గొన్నారు. అరెస్టైన వారిలో నావల్నీ భార్య యూలియా కూడా ఉండటం గమనార్హం. మొత్తంగా 100కు పైగా నగరాల్లో నిరసనలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. పుతిన్‌ భారీ అవినీతికి పాల్పడ్డారంటూ నావల్నీ చాలాకాలంగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 

ఈ నేపథ్యంలో.. గత నెల 17న జర్మనీ నుంచి రష్యాలో అడుగుపెట్టిన ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. నావల్నీని విడుదల చేయాలంటూ రష్యాకు అమెరికా సూచించింది. నిరసనకారుల్ని అరెస్టు చేయడాన్ని ఖండించింది.

కాగా.. కొంత కాలం క్రితం ప్రతిపక్ష నేత నావల్నీ.. జర్మనీ వెళుతుండగా.. కళ్లు తిరిగి పడిపోయారు. వైద్య పరీక్షల్లో ఆయనపై విషప్రయోగం జరిగినట్లు తేలింది. తన నీలిరంగు లోదుస్తుల్లో రష్యాకు చెందిన ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీ్‌స(ఎ్‌ఫఎ్‌సబీ) ఓ విషపూరిత పదార్థాన్ని ప్రయోగించి, హత్య చేసేందుకు చూసిందని నావల్నీ ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో.. ఆదివారం నాటి ర్యాలీల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున నీలిరంగు అండర్‌వేర్లను చేతుల్లో పట్టుకుని తిరగడంతో పాటు, పలు చోట్ల వేలాడదీశారు. ఇక.. పుతిన్‌కు చెందినదిగా చెబుతున్న భవనంలో రూ.45వేల టాయిలెట్‌ బ్రష్‌ వాడకాన్ని విమర్శిస్తూ.. వందలాది మంది టాయిలెట్‌ బ్రష్‌లను ప్రదర్శనలోకి తీసుకొచ్చారు. 

click me!