మాయన్మార్ లో సంక్షోభం.. సైనికుల అదుపులో ఆంగ్ సాన్ సూకీ

By telugu news teamFirst Published Feb 1, 2021, 9:41 AM IST
Highlights

ప్రముఖ నేత ఆంగ్ సాన్ సూకీని సైనికులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో.. మాయన్మార్ లో ఏడాది పాటు ఎమర్జెన్సీ ప్రకటించడం గమనార్హం.

మాయన్మార్ లో  రాజకీయ సంక్షోభం తలెత్తింది.  దేశంలో సైనికులు తిరుగుబాటు ప్రకటించారు. ఈ క్రమంలో.. ప్రముఖ నేత ఆంగ్ సాన్ సూకీని సైనికులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో.. మాయన్మార్ లో ఏడాది పాటు ఎమర్జెన్సీ ప్రకటించడం గమనార్హం. మాయన్మార్ మిలిటరీ ఈ మేరకు ప్రకటన చేసింది.

మయన్మార్‌లో ఎన్నికల అనంతరం అక్కడ ప్రభుత్వానికి, మిలటరీకి మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ లీగ్ ఫర్ డెమెక్రసీ నేత అంగ్‌సాన్ సూకీతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతలను సైనికులు అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ ప్రతినిధి వెల్లడిచారు. 

కాగా మయన్మార్‌లోని ప్రధాన నగరమైన యాంగోన్ సిటీ హాల్ బయట సైనికులు మోహరించినట్లు సమాచారం. అలాగే దేశమంతటా ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. అయితే మయన్మార్ మిలటరీ కుట్రపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాల ప్రకారం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో తాము జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ప్రజా నేత ఆంగ్ సాన్ సూకీతో సహా ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని ఆస్ట్రేలియా కోరింది.

click me!