వుహాన్ మార్కెట్‌ను పరిశీలించిన నిపుణుల బృందం: కరోనా మూలాలపై పరిశోధన

By narsimha lodeFirst Published Jan 31, 2021, 5:25 PM IST
Highlights

కరోనా మూలాలను కనుగొనేందుకు చైనాలోని వూహాన్ మార్కెట్ లో నిపుణుల బృందం పరిశోధనలను ముమ్మరం చేసింది. 

బీజింగ్: కరోనా మూలాలను కనుగొనేందుకు చైనాలోని వూహాన్ మార్కెట్ లో నిపుణుల బృందం పరిశోధనలను ముమ్మరం చేసింది. వైరస్ వ్యాప్తికి మూల కేంద్రంగా భావిస్తున్న వుహాన్ లో అతిపెద్ద మాంసాహార మార్కెట్ ను ఆదివారం నాడు నిపుణుల బృందం సందర్శించింది.

ఈ మార్కెట్  కేంద్రంగానే లాక్‌డౌన్ సమయంలో చైనా ప్రభుత్వం వుహాన్ లోని ప్రతి ఇంటిక ఆహారాన్ని చేరవేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందంతో పాటు పెద్ద సంఖ్యలో చైనా అధికారులు ,అధికారులు, ప్రతినిధులు మార్కెట్ ప్రాంతానికి తరలి వచ్చారు.

తొలిదశలో కరోనా కేసులు నమోదైన వూహాన్ లో జిన్ యాన్ టాన్ ఆసుపత్రిని హుబెయ్ ప్రావిన్స్ లోని చైనీస్, వెస్టర్న్ మెడిసిన్ ఆసుపత్రిని ఇప్పటికే ఈ బృందం సందర్శించింది.ఓ మ్యూజియంలోనూ శనివారం పర్యటించి వివరాలు సేకరించింది.  వుహాన్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రయోగశాలను కూడా ఈ బృందం సందర్శించనుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది.
 

click me!