ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మరో మలేరియా టీకాకు ఆమోదం తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మరో మలేరియా టీకాకు ఆమోదం తెలిపింది. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఆర్21/మ్యాట్రిక్స్-ఎం మలేరియా వ్యాక్సిన్‌ను అవసరమైన భద్రత, నాణ్యత, ప్రభావ ప్రమాణాలను పాటించిన తర్వాత డబ్ల్యూహెచ్‌వో ఉపయోగం కోసం సిఫార్సు చేసింది. డబ్ల్యూహెచ్‌వో స్వతంత్ర సలహా సంఘం, నిపుణుల వ్యూహాత్మక సలహా బృందం(ఎస్ఏజీఈ), మలేరియా పాలసీ అడ్వైజరీ గ్రూప్ (ఎంపీఏజీ) కఠినమైన, వివరణాత్మక శాస్త్రీయ సమీక్ష తర్వాత ఈ మలేరియా వ్యాక్సిన్ ఉపయోగం కోసం సిఫార్సు చేయబడింది.
ఇక, ఇది మూడు డోసుల వ్యాక్సిన్. మలేరియాపై ఇది 75 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన రెండో మలేరియా టీకా ఇది. ‘‘ఈ సిఫార్సు ప్రీ-క్లినికల్, క్లినికల్ ట్రయల్ డేటాపై ఆధారపడింది. ఇది నాలుగు దేశాలలో కాలానుగుణ, శాశ్వత మలేరియా ప్రసారం ఉన్న సైట్‌లలో మంచి భద్రత, అధిక సామర్థ్యాన్ని చూపించింది. ఇది పిల్లలలో మలేరియాను నిరోధించడానికి ప్రపంచంలోని రెండో డబ్ల్యూహెచ్ సిఫార్సు చేసిన టీకాగా నిలిచింది’’అని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
undefined
ఇక, యూరోపియన్, అభివృద్ధి చెందుతున్న దేశాల క్లినికల్ ట్రయల్స్ పార్టనర్‌షిప్, వెల్‌కమ్ ట్రస్ట్, యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఈఐబీ) మద్దతుతో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని జెన్నర్ ఇన్‌స్టిట్యూట్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేశాయి. ఇక, ఈ రోజు వరకు.. ఈ మలేరియా వ్యాక్సిన్ ఘనా, నైజీరియా, బుర్కినా ఫాసోలో ఉపయోగించడానికి లైసెన్స్ పొందింది.
ఇక, రెండు నిపుణుల బృందాల సలహా మేరకు ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపినట్టు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ 2-4 డాలర్లు ఉండవచ్చని, వచ్చే ఏడాది కొన్ని దేశాల్లో ఇది అందుబాటులో ఉండనుందని టెడ్రోస్ చెప్పారు. ఇక, 2021లో మలేరియా తొలి టీకాకు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం తెలిపింది. జీఎస్‌కే సంస్థ రూపొందించిన ఈ టీకా కేవలం 30 శాతం మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుంది.