వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ ప్రైజ్: కాటలిన్ కరికో, డ్రూవెయిస్‌మన్ కు అవార్డులు

By narsimha lodeFirst Published Oct 2, 2023, 5:17 PM IST
Highlights

వైద్యశాస్త్రంలో కాటలిన్ కరికో, డ్రూవెయిస్‌మన్ కు నోబెల్ అవార్ఢు దక్కింది. కరోనా వ్యాక్సిన్లకు మార్గం చేసిన ఎంఆర్ఎన్ఎ సాంకేతికతపై  ఈ అవార్డు ఇచ్చారు.

స్టాక్‌హోమ్:వైద్య శాస్త్రంలో కాటలిన్ కరికో, డ్రూవెయిస్‌మన్ కు నోబెల్ అవార్డు దక్కింది. కరోనా వ్యాక్సిన్లకు మార్గం చేసిన ఎంఆర్ఎన్ఎ సాంకేతికపై పనిచేసినందుకు ఈ అవార్డు దక్కింది.న్యూక్లియోసైడ్ బేస్ కు సంబంధించి ఆవిష్కరణకు ఈ అవార్డు అందించారు. ఈ ఏడాది డిసెంబర్ 10న విజేతలకు  నోబెల్ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

ప్రపంచానికి సవాల్ విసిరిన కరోనా వ్యాక్సిన్ కు దోహదం చేసిన ఈ ఇద్దరికి నోబెల్ పురస్కారం అందించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా జ్యురీ తెలిపింది.ఎంఆర్ఎన్ఏ టెక్నాలిజీని ఉపయోగించి కరోనా వ్యాక్సిన్ ను  ఫైజర్, బయోఎన్ టెక్, మోడర్నా కంపెనీలు తయారు చేశాయి.

హంగేరీకి చెందిన కారికో పలు అవార్డులను గెలుచుకున్నారు.2021లో  లాస్కర్ అవార్డును కూడ ఆయన స్వంతమైంది.ఎంఆర్ఎన్‌ఎ వ్యాక్సిన్ లు జన్యు అణువులు అందిస్తాయి. ఇవి కణాలకు ఏ ప్రొటిన్లను తయారు చేయాలో తెలుపుతాయి.  నిజమైన వైరస్ ను ఎదుర్కొన్న సమయంలో రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది.గత ఏడాది మెడిసిన్ లో స్వీడీష్ పాలియోజెనిటిస్ట్ స్వాంటేపాబోకు దక్కింది.

click me!