Coronavirus: 10 వారాల్లో 90 మిలియన్ల కేసులు.. చాలా దేశాల్లో ఒమిక్రాన్ ఉప్పెన !

By Mahesh Rajamoni  |  First Published Feb 2, 2022, 11:56 AM IST

Coronavirus: అన్ని దేశాల్లోనూ క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. ఒమిక్రాన్ వేరియంట్‌ను 10 వారాల క్రితం గుర్తించినప్పటి నుండి ఇప్ప‌టివ‌కు 90 మిలియన్ల కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. COVID-19 మహమ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెలుగులోకి వ‌చ్చిన 2020 సంవ‌త్స‌రంలో కంటే చాలా ఎక్కువ‌ని పేర్కొంది.
 


Coronavirus: అన్ని దేశాల్లోనూ క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.  అయితే, ఒమిక్రాన్ వేరియంట్‌ను 10 వారాల క్రితం గుర్తించినప్పటి నుండి  ఇప్ప‌టివ‌కు 90 మిలియన్ల కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. COVID-19 మహమ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెలుగులోకి వ‌చ్చిన 2020 సంవ‌త్స‌రంలో కంటే చాలా ఎక్కువ‌ని పేర్కొంది. 

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనాన్ ఘెబ్రేయస్ అన్ని దేశాల్లోనూ ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న క‌రోనా ప‌రిస్థితుల‌పై మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా...  ఓమిక్రాన్ మునుపటి వైవిధ్యాల కంటే తక్కువ తీవ్రమైన అనారోగ్యాన్ని తెచ్చిపెట్టినప్పటికీ తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించాడు. కేసులు పెరుగుద‌ల‌తో పాటు మ‌ర‌ణాలు సైతం ఆందోళ‌క‌ర స్థాయిలో పెరుగుతున్నాయి. చాలా దేశాల్లో ఈ ప‌రిస్థితి ఉంద‌ని తెలిపారు. గ‌తేడాది న‌వంబ‌ర్ లో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ తొలిసారిగా బయటప‌డింద‌ని వెల్ల‌డించిన ఆయ‌న‌..  అప్ప‌టి నుంచి ఇప్పటి వరకు అంటే కేవ‌లం 10 వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు వెలుగుచూసిన 2020లో ఏడాది మొత్తంలో నమోదైన కేసుల కంటే ఈ సంఖ్య  చాలా ఎక్కువగా ఉంద‌ని తెలిపారు. 

Latest Videos

undefined

ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్ విజృంభ‌ణ కొన‌సాగించిన కొన్ని రోజుల నుంచి..  యూరోపియన్‌ దేశాల్లో ఒమిక్రాన్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గుతున్న‌ద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనూ ఈయూ దేశాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తున్నాయ‌ని చెప్పారు. అయితే, ఇప్ప‌టికీ ప‌లు దేశాల్లో నిత్యం ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని తెలిపారు. ఇంత స్థాయిలో కేసులు న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌ని తెలిపారు. మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్న ప‌రిస్థితులు ఉన్నాయ‌నీ, ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేయవద్దని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ హెచ్చరించారు. ఎక్కువ మందికి త‌క్కువ స‌మ‌యంలోనే వ్యాపిస్తున్న‌.. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నదని అలసత్వం వహించవద్దని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో మరణాలు ఎక్కువగా ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొన్నారు. 

ఇదిలావుండ‌గా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 382,177,997 క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, కోవిడ్‌-19 తో పోరాడుతూ 5,706,405 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 303,119,637కు పెరిగింది. అన్ని దేశాల్లో క‌లిపి ప్ర‌స్తుతం నిత్యం 30 ల‌క్ష‌ల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మ‌ర‌ణాలు సైతం అధికంగానే చోటుచేసుకుంటున్నాయి. క‌రోనా వైర‌స్ కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన జాబితాలో అమెరికా అగ్ర‌స్థానంలో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో మొత్తం 76,516,202 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 913,924 మంది ప్రాణాలు కోల్పోయారు. 46,647,029 మంది కోలుకున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు అధికంగా న‌మోదైన దేశాల జాబితాలో అమెరికా, భార‌త్‌, బ్రెజిల్ దేశాలు టాప్-3 ఉన్నాయి. ఆ త‌ర్వాతి స్థానంలో ఫ్రాన్స్, యూకే, ర‌ష్యా, ట‌ర్కీ, ఇట‌లీ, జ‌ర్మ‌నీ, స్పెయిన్‌, అర్జెంటీనా, ఇరాన్ దేశాలు ఉన్నాయి. 
 

click me!