కృతిమ స్వీటెనర్‌ అస్పర్టమే క్యాన్సర్ కారకం కానుందా?.. డబ్ల్యూహెచ్‌వో అధ్యయనంలో షాకింగ్ సమాచారం..

Published : Jun 29, 2023, 01:45 PM IST
కృతిమ స్వీటెనర్‌ అస్పర్టమే క్యాన్సర్ కారకం కానుందా?.. డబ్ల్యూహెచ్‌వో అధ్యయనంలో షాకింగ్ సమాచారం..

సారాంశం

ప్రపంచంలోని అత్యంత సాధారణ కృత్రిమ స్వీటెనర్‌లలో ఒకదానిని వచ్చే నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ పరిశోధన ఏజెన్సీ  చేత క్యాన్సర్ కారకంగా ప్రకటించే అవకాశం ఉంది. 

ప్రపంచంలోని అత్యంత సాధారణ కృత్రిమ స్వీటెనర్‌లలో ఒకటి వచ్చే నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ పరిశోధన ఏజెన్సీ  చేత క్యాన్సర్ కారకంగా ప్రకటించబడుతుందని మూలాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీటెనర్‌లో ఒకటిగా ఉన్న.. అస్పర్టమేను క్యాన్సర్ కారకంగా ప్రకటించనున్నట్టుగా తెలిపింది. కోకా-కోలా డైట్ సోడాల నుంచి మార్స్ ఎక్స్‌ట్రా చూయింగ్ గమ్, కొన్ని స్నాప్‌పుల్ డ్రింక్స్ వరకు ఉపయోగించే అస్పర్టమే.. మొదటిసారిగా డబ్ల్యూహెచ్‌వో క్యానర్సర్ పరిశోధన విభాగం ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC)చేత జూలైలో ‘‘మానవులకు క్యాన్సర్ కారకాలు’’గా జాబితా చేయబడనుంది. 

అందుబాటులో ఉన్న అన్ని సాక్ష్యాల ఆధారంగా ఏదైనా సంభావ్య ప్రమాదమా? కాదా? అని అంచనా వేయడానికి ఉద్దేశించబడిన బాహ్య నిపుణుల గ్రూప్ సమావేశం తర్వాత ఈ నెల ప్రారంభంలో ఐఏఆర్‌సీ తీర్పు ఖరారు చేయబడింది. అయితే ఒక వ్యక్తి ఎంత ఉత్పత్తిని సురక్షితంగా వినియోగించవచ్చనేది ఇది పరిగణనలోకి తీసుకోదు.

అయితే ఈ రకమైన సలహా JECFA (జాయింట్ డబ్ల్యూహెచ్‌వో అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ ఎడిటివ్స్) అని పిలువబడే ఆహార సంకలనాలపై ప్రత్యేక డబ్ల్యూహెచ్‌వో నిపుణుల కమిటీ నుండి వస్తుంది. అలాగే జాతీయ రెగ్యూలటర్స్ నుంచి నిర్ణయించబడుతుంది.

ఏది ఏమైనప్పటికీ.. వివిధ పదార్ధాల కోసం గతంలో ఇదే విధమైన ఐఏఆర్‌సీ తీర్పులు వినియోగదారులలో వాటి ఉపయోగం గురించి ఆందోళనలను లేవనెత్తాయి. వాటిని సవాలు చేస్తూ వ్యాజ్యాలకు కూడా దారితీసింది. వంటకాలను పునఃసృష్టి, ప్రత్యామ్నాయాలకు మార్చుకోమని తయారీదారులను ఒత్తిడి చేసింది. మరోవైపు ఐఏఆర్‌సీ అంచనాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తాయని విమర్శలకు దారితీసింది.

జేఈసీఎఫ్‌ఏ ఈ సంవత్సరం అస్పర్టమే వినియోగాన్ని సమీక్షిస్తోంది. ఇందుకు సంబంధించిన సమావేశం జూన్ చివరిలో ప్రారంభమైంది. జూలై 14న ఐఏఆర్‌సీ తన నిర్ణయాన్ని బహిరంగపరచిన అదే రోజున.. దాని ఫలితాలను ప్రకటించనుంది.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే