పాకిస్తాన్‌లో దారుణం.. ఇంట్లోకి చొరబడి కాల్పులు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి..

Published : Jun 28, 2023, 04:19 PM IST
పాకిస్తాన్‌లో దారుణం.. ఇంట్లోకి చొరబడి కాల్పులు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి..

సారాంశం

పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందిని చంపారు.

పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందిని చంపారు. ఈ ఘటన మలాకంద్ జిల్లాలోని బత్ఖేలా తహసీల్‌లో మంగళవారం అర్దరాత్రి చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక లెవీస్ ఫోర్స్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బత్‌ఖెలా ఆస్పత్రికి తరలించారు.

Also Read: ఉద్దేశపూర్వకంగానే చైనా కరోనాను ‘‘బయో ఆయుధం’’గా రూపొందించింది.. వుహాన్ పరిశోధకుడి షాకింగ్ కామెంట్స్

పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే హత్యాకాండకు వ్యతిరేకంగా స్థానికులు మృతదేహాలను రోడ్డు మధ్యలో ఉంచి నిరసన తెలిపారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. అయితే ఈ మరణకాండ వెనక బాధిత కుటుంబంలోని ఓ మహిళ వివాహ వివాదమే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కాల్పుల్లో ఆమె కూడా మరణించిదని చెబుతున్నారు. అయితే ఈ విషయాలను పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే