కరోనా కలకలం: ప్రపంచంలో తొలిసారిగా జింకకు కోవిడ్

By narsimha lodeFirst Published Aug 29, 2021, 11:58 AM IST
Highlights

ప్రపంచంలో  తెల్లతోక జింకకు కరోనా సోకింది. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని  జింకకు కరోనా సోకిన విషయాన్ని అధికారులు గుర్తించారు. గతంలో పులులు,. సింహాలకు కరోనా సోకిన విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే.

వాషింగ్టన్: ప్రపంచంలో తొలిసారిగా జింకకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు. మనుషులకు సోకే కరోనా  జంతువులకు కూడా సోకుతుందని ఇటీవల కాలంలో తేలింది. గతంలో పులులు, సింహాలకు కూడ కరోనా సోకినట్టుగా తేలింది. తాజాగా జింకకు కూడ సోకినట్టుగా అధికారులు గుర్తించారు. 

అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని ఓ జింకకు కరోనా సోకిందని అమెరికా అధికారులు గుర్తించారు. మనుషుల ద్వారా కరోనా సోకిందా లేదా ఇతర జంతువుల ద్వారా కరోనా వ్యాప్తి చెందిందా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఈ విషయమై అధికారులు  పరిశోధనలు చేస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న జంతువులకు కరోనా సోకినట్టుగా పరిశోధనల్లో తేలింది.

2020  జనవరి  నుండి 2021 మార్చి  వరకు సేకరించిన 481 బ్లడ్ శాంపిల్స్ లో  కరోనా యాంటీబాడీస్ ను  శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలో సుమారు 30 మిలియన్ తెల్లతోక జింకలున్నాయి. ఈ జింకలు మనుషులతో సన్నిహితంగా ఉంటాయి. కరోనా సోకిన జింకల నుండి మాంసాన్ని తింటే కరోనా సోకుతుందని ఇప్పటివరకు శాస్రీయంగా  ఆధారాలు లభించలేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.నాలుగు రాష్ట్రాల్లోని 32 కౌంటీల్లో జింకల నుండి శాంపిల్స్ ‌ సేకరించారు. 

click me!