కాబూల్ ఎయిర్‌పోర్టుపై మరో ఉగ్రదాడి జరిగే ఛాన్స్: బైడెన్ వార్నింగ్

By narsimha lodeFirst Published Aug 29, 2021, 11:32 AM IST
Highlights

కాబూల్ విమానాశ్రయంపై మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చిరించారు.  ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం నాడు ప్రకటించారు. ఈ మేరకు తమకు కచ్చితమైన సమాచారం ఉందని ఆయన మీడియాకు వివరించారు. కాబూల్ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయాలని అమెరికా సైన్యం స్థానికులను హెచ్చరించింది.

కాబూల్: కాబూల్ విమానాశ్రయంపై మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు తమకు కచ్చితమైన సమాచారం ఉందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు.కాబూల్‌లోని ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని కూడ అమెరికా సైన్యం  హెచ్చరించింది. కాబూల్ లో ఎయిర్‌పోర్టు నుండి  విమానాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటపడాలని వందలాది మంది ప్రయత్నాలు చేస్తున్నారు. 

also read:ఆఫ్ఘనిస్తాన్: కాబూల్ ఎయిర్ పోర్టును దిగ్బంధించిన తాలిబన్లు.. రోడ్లన్నీ బ్లాక్‌, దారంతా చెక్‌పోస్ట్‌లే

అయితే  ఈ ఎయిర్‌పోర్టు  వద్ద ఉగ్రదాడి చోటు చేసుకొంది.  ఈ నెల 26వ తేదీన పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో సుమారు 160 మందికిపైగా మరణించారు.ఈ ఘటనను అమెరికా సీరియస్‌గా తీసుకొంది. దాడులకు పాల్పడిన నిందితులపై  అమెరికా దాడులకు పాల్పడింది. 

ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి కూడా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.రానున్న 24-36 గంటల్లో   మరో దాడి జరిగే అవకాశం  ఉందని కమాండర్లుత తన దృష్టికి తీసుకొచ్చారని బైడెన్ తెలిపారు.  ఆఫ్ఘనిస్తాన్‌లో తమ దేశానికి చెందిన సైనికులను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బైడెన్ ఆర్మీని ఆదేశించారు.గురువారం నాడు ఐసిస్‌-కెపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని బైడెన్ తేల్చి చెప్పారు.

click me!