Vladimir Putin: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మరోసారి వార్తల్లో హాట్ టాఫిక్ గా నిలిచారు. 71 ఏండ్ల లేటు వయస్సు వ్లాదిమిర్ పుతిన్ ఘాటు ప్రేమలో పడ్డారట. అది కూడా తన కంటే 32 ఏళ్లు చిన్నదైనయువతితో సన్నిహితంగా ఉంటున్నట్లు కథనాలు వస్తున్నాయి.
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మరోసారి వార్తల్లో హాట్ టాఫిక్ గా నిలిచారు. 71 ఏండ్ల లేటు వయస్సు వ్లాదిమిర్ పుతిన్ ఘాటు ప్రేమలో పడ్డారంట. అది కూడా ఓ ఓల్డ్ లేడీతో అనుకుంటే.. పొరపాటే.. తన కంటే.. ఏళ్లు చిన్నదైన ఓ యువతితో పుతిన్ సన్నిహితంగా ఉంటున్నట్లు , ఆ యంగ్ లేడీతో ప్రేమాణయం సాగిస్తున్నట్టు టాక్. వీరిద్దరి సాన్నిహిత్యం గురించి న్యూయార్క్ పోస్ట్ వార్తాపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఇంతకీ ఆ హాట్ బ్యూటీ ఎవరు? పుతిన్ మదిని దోచుకున్న ఆ అమ్మాయి ఎవరో మీరు కూడా ఓ లూక్కేయండి..
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) గత కొంత కాలంగా 39 ఏళ్ల ఎకటెరినా మిజులినా(Ekaterina Mizulina)తో సన్నిహితంగా ఉన్నట్లు రాసుకొచ్చింది. ఆ అమ్మడు మరేవరో కాదు.. పుతిన్‌కు ఎంతో కాలంగా అనుకూల వ్యక్తిగా పేరున్న మాజీ సెనెటర్ సెనేటర్ ఎలెనా మిజులినా(69) కూతురే ఎకటెరినా మిజులినా. ఎకటెరినా మిజులినా (39) ఒక కళా చరిత్రకారిణీ. రష్యాలోని క్రెమ్లిన్ లోని సేఫ్ ఇంటర్నెట్ లీగ్‌కు మిజులినా నాయకత్వం వహిస్తుందట. ఈ సంస్థ ప్రధానంగా రష్యా , దాని అధ్యక్షుడిపై విమర్శలను తొలగించడంపై పని చేస్తుంది.
రష్యా మానవ హక్కుల ప్రచారకర్త ఓల్గా రొమానోవా ఉక్రెయిన్ ఛానెల్ 24తో మాట్లాడుతూ, "మిజులినా పుతిన్‌ను పూర్తిగా ఆరాధిస్తుంది. బార్బీ లుక్ ఎల్లప్పుడూ ఆమెకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది" అని పేర్కొంది.71 ఏళ్ల పుతిన్ .. ఒలింపిక్ జిమ్నాస్ట్ అలీనా కబేవాతో ఎఫైర్‌లో ఉన్నట్లు చాలా కాలంగా పుకార్లు వచ్చాయి. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు భావిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు తన 30 ఏళ్ల భార్య లియుడ్మిలాకు 2014లో విడాకులు ఇచ్చాడు.
రష్యాలోని అనేక ఉక్రేనియన్ మీడియా సంస్థలు, టెలిగ్రామ్ ఛానెల్‌లు పుతిన్ - మిజులినా గురించి వార్తలను పోస్ట్ చేస్తున్నాయి. వారు ఇటీవల ఒకరికొకరు సన్నిహితంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఈ బంధానికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు. మిజులినా 2004లో యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ నుండి ఆర్ట్ హిస్టరీలో అలాగే.. ఇండోనేషియా భాషలో పట్టాభద్రురాలు రష్యా మీడియా పేర్కొంది. 2017లో సేఫ్ ఇంటర్నెట్ లీగ్‌లో చేరడానికి ముందు.. ఆమె చైనాను సందర్శించే అధికారిక రష్యన్ ప్రతినిధులకు ట్రాన్స్ లేటర్ గా పనిచేసింది.