India-UK Young Professionals Scheme: భారతీయ యువతకు బ్రిటన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. యూకేకు వెళ్ళి అక్కడే చదువుకోవడానికి, పని చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. బ్రిటన్-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద మూడు వేల మంది భారతీయ యువతకు బ్రిటన్ వెళ్లే అవకాశం లభిస్తుంది. ఈ పథకం కింద భారతదేశంలోని ప్రతిభావంతులైన యువతకు బ్రిటన్ సర్కార్ వీసా అందిస్తుంది.
India-UK Young Professionals Scheme: భారతీయ నిపుణులకు బ్రిటన్ బంపరాఫర్ ఇచ్చింది. ఉన్నత విద్య కోసం, ఉపాధి అవకాశాల కోసం బ్రిటన్‌కు వెళ్లాలనుకొంటున్న భారత యువతకు ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ శుభవార్త అందించారు. డిగ్రీ పూర్తిచేసిన 18-30 ఏండ్లలోపు భారతీయులు రెండేండ్లపాటు బ్రిటన్‌లో చదువుకొనేందుకు, ఉద్యోగం చేసుకొనేందుకు నూతన బ్యాలెట్ విధానం ప్రకారం 3 వేల వీసాలు జారీ చేయనుంది.
ఈ మేరకు భారత్ లోని బ్రిటన్ హై కమిషన్ కార్యాలయం యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ పేరిట ఓ ప్రకటన చేసింది. బ్రిటన్ జాతీయులు భారత్‌లో నివసించేందుకు, పని చేసుకునేందుకు వీలు కల్పించే ఈ పథకంపై యూకే-ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్ (ఎంఎంపీ)లో భాగంగా ఇరుదేశాల మధ్య గతంలో ఒప్పందాలు జరిగాయి. వీసాల జారీకి చేపట్టే బ్యాలట్ విధానంలో ప్రవేశించేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. అయితే, వీసా జారీ అయ్యాక రూ.31 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
undefined
యుకె-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద అర్హులైన 3,000 మంది భారతీయులకు వీసాలు అందుబాటులోకి వస్తాయి. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద, 18 మరియు 30 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు బ్రిటన్‌లో రెండేళ్లపాటు నివసించడానికి, పని చేయడానికి అనుమతించబడతారు. ఇందులోకి బ్యాలెట్ విధానంలో ప్రవేశం కల్పిస్తారు. బ్రిటీష్ హైకమిషన్- న్యూ ఢిల్లీ .. ఈ కొత్త స్కీమ్ కోసం వివరణాత్మక అర్హత ప్రమాణాలను విడుదల చేస్తూ, 18-30 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతదేశంలోని ప్రతిభావంతమైన యువతకు ఇది గొప్ప అవకాశం.
భారత యువ నిపుణుల కోసం 3 వేల స్థానాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో చాలావరకు ఫిబ్రవరి బ్యాలట్ కోటాలో అందుబాటులోకి తెస్తామని బ్రిటన్ తెలిపింది. మిగతా వీసాలు జులై బ్యాలట్ లో అందుబాటులోకి ఉంటాయని పేర్కొంది. బ్యాలట్ విండో ఫిబ్రవరి 20న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై.. ఫిబ్రవరి 22 వరకు వీసా దరఖాస్తులకు అవకాశం ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడానికి అర్హత
- బ్యాచిలర్ డిగ్రీ లేదా ఉన్నత విద్యా సర్టిఫికేట్ ఉన్న దరఖాస్తుదారులు అర్హులు.
- UK ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని మార్గదర్శకాల ప్రకారం, అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ వివరాలు, పాస్‌పోర్ట్ స్కాన్ లేదా ఫోటో, ఫోన్ నంబర్ , ఇమెయిల్ చిరునామా మొదలైనవి.
- దరఖాస్తు చేయడానికి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు.