Viral Video: స్నార్కెలింగ్ చేస్తున్న ఓ మహిళ చెవిలోకి పీత వెళ్లింది. ఆమె చెవిలోంచి ఆ పీత బయటకు వచ్చిన దృశ్యాలున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Crab Gets Stuck In Woman’s Ear: ఇప్పటివరకు చెవిలోకి చిన్న చిన్న పురుగులు, చీమలు వెళ్లిన సంఘటనలు గురించి తెలిసే ఉంటుంది. వాటిని చెవిలోంచి బయటకు తీయడానికి పడే కష్టం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే తరహా ఘటనకు బంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే, చెవిలోకి వెళ్లింది చీమలో.. చిన్న చిన్న పురుగులో కాదు.. ఏకంగా ఓ పీత చెవిలోకి వెళ్లింది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ వీడియో దృశ్యాలు గమనిస్తే.. చెవిలోకి ఎదో వెళ్లి ఓ మహిళ ఇబ్బంది పడుతోంది. చెవిలోంచి దానిని తీయడానికి ఓ వ్యక్తి ట్వీజర్ ను పట్టుకుని ప్రయత్నిస్తున్నాడు. ఆ మహిళ బాధపడుతున్న దృశ్యాలు కనిపించాయి. చెవిలోంచి దానిని బయటకు తీయగా.. అది ఒక పీత అని తెలిసింది.
undefined
ఒక మహిళ చెవిలో పీత ఇరుక్కున్నట్లు వీడియో దృశ్యాలు కనిపించడంతో సోషల్ మీడియా యూజర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో చోటుచేసుకుంది. స్నార్కెలింగ్ చేస్తున్న మహిళ చెవిలో చిన్న పీత ప్రవేశించడంతో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియోను '@wesdaisy' అనే యూజర్ టిక్‌టాక్‌లో షేర్ చేశారు. వీడియోలో ఒక వ్యక్తి మహిళ చెవి దగ్గర ట్వీజర్‌ను పట్టుకుని ఏదో బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఆమె కంగారుకు లోనై.. ఇబ్బంది పడుతుండగా.. ఆమెను ఒక వ్యక్తి ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కొద్ది సమయం బాధ కలగడం తప్పదని చెప్పిన ఆ వ్యక్తి ఆమె చెవిలోంచి ట్వీజర్ తో లోపల ఇరుక్కున్న పీతన బయటకు తీశాడు. ఆ స్త్రీ భయపడిపోయి, అదేమిటి? అని అరిచింది.
ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆమె చెవుల నుండి పీత బయటకు రావడం చూసి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చాలా మంది తమ భయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాధిత మహిళ బాగానే ఉంది. అయితే, స్నార్కెల్ చేస్తున్నప్పుడు చెవికి ప్లగ్స్ ధరించమని సూచించింది.