బైకర్ స్టంట్‌‌కు నెటిజన్లు ఫిదా.. ఏటవాలు కొండను ఎక్కించిన రైడర్ (వీడియో)

By Mahesh KFirst Published Dec 29, 2022, 5:35 PM IST
Highlights

సోషల్ మీడియాలో ఓ బైక్ స్టైంట్ తెగ వైరల్ అవుతున్నది. బైకర్ తన వాహనాన్ని ఏటవాలుగా ఉన్న కొండపైకి ఎక్కించాడు. కొన్ని సార్లు అసాధ్యాలు సాధ్యం అవుతాయని ఓ యూజర్ ఈ వీడియోను పోస్టు చేశారు.
 

న్యూఢిల్లీ: యూత్‌కు బైక్ స్టంట్‌లపై ఆసక్తి ఎక్కువ. బైక్ ఎక్కామంటే.. కాలంతో పోటీ పడటమే అన్నట్టు దూసుకుపోతుంటారు. చాలా మంది బైక్ స్టంట్‌ల వీడియోలు కూడా చూస్తుంటారు. లాంగ్ రైడ్లు, రాక్ క్లైంబింగ్, డర్ట్ బైకింగ్‌ ఇందులో చాలా ఫేమస్‌గా ఉంటాయి.ఇదంతా అడ్వెంచర్ జోన్. స్టంట్ చేస్తుండగా ప్రమాదాలు జరిగే అవకాశాలే ఎక్కువ. అందుకే వీక్షకులు నరాలు తెగే ఉత్కంఠతో చూస్తుంటారు. ఇలాంటి వీడియోలో సోషల్ మీడియాలో.. ఇంటర్నెట్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి ఓ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 

ఓ బైకర్ తన బైక్‌ను ఏటవాలుగా ఉన్న కొండను ఎక్కించాడు. కొండ కింద మొదలైన బైక్ ఆది నుంచి చివరకు కొండ పైకి ఎక్కే వరకూ ఎక్కడా పేస్ తగ్గకుండా దూసుకెళ్లింది. ఇది నిజమేనా? అనేంత ఆశ్చర్యంలోకి ఈ వీడియో ముంచుతున్నది. ఆ కొండ పైకి బైక్ ఎక్కించగలమన్న ఆలోచన కూడా సామాన్యులకు రాదు.. వచ్చినా అది సాధ్యం కాదనే కొట్టిపడేస్తాం. పొగలు చిమ్ముకుంటూ ఆ బైక్ కొండ చివరికి ఓ జంప్‌తో జర్నీని ముగించిన వీడియో కట్టిపడేస్తున్నది. 

Sometimes the impossible is possible pic.twitter.com/aBcKXGV1eb

— Lo+Viral 🔥 (@TheBest_Viral)

Also Read: ఉయ్యూరులో విషాదం: బైక్‌పై విన్యాసాలు చేస్తూ గాయపడిన సాయికృష్ణ మృతి

ఇప్పటికే సుమారు లక్ష మంది ఈ వీడియోను చూశారు. మూడు వేలకు పై చిలుకు లైక్స్ కొట్టారు. కొన్ని సార్లు అసాధ్యాలు సాధ్యం అవుతాయనే క్యాప్షన్‌తో వీడియో పెట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు. కామెంట్ సెక్షన్‌లో స్ట్రాంగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. తాము చిన్నప్పటి నుంచి స్టంట్స్ చేస్తూనే పెరిగామని, రెడ్ రివర్ వైపున ఉన్న ఏ కొండ తమకు అసాధ్యంగా ఉండేది కాదని ఓ యూజర్ కామెంట్ చేశాడు. అయితే, హెల్మెట్ మాత్రం తప్పకుండా ధరించేవారిమని వివరించాడు. గ్రావిటీపైనే అనుమానంతో ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.

click me!