ఫ్లోరిడాలో కుప్పకూలిన భవనం: నలుగురి మృతి, 159 మంది గల్లంతు

Published : Jun 25, 2021, 07:12 PM IST
ఫ్లోరిడాలో కుప్పకూలిన భవనం: నలుగురి మృతి, 159 మంది గల్లంతు

సారాంశం

అమెరికాలోని ఫ్లోరిడాలో  భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మరణించారు. 159 మంది ఆచూకీ గల్లంతయ్యారు.


వాషింగ్టన్: అమెరికాలోని ఫ్లోరిడాలో  భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మరణించారు. 159 మంది ఆచూకీ గల్లంతయ్యారు.చాంప్లైన్ టవర్ సౌత్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. 30 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో శిథిలాలు పేరుకుపోయాయి.  శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు.

మియామీ బీచ్ కు ఉత్తరాన 6 మైళ్ల  దూరంలో ఉన్న బీచ్ సైడ్ టౌన్  సర్ప్ సైడ్ లో 12 అంతస్థుల రెసిడెన్షియల్ భవనం కుప్పకూలింది. ఈ భవనంలోని 136 యూనిట్లలో 56 కుప్పకూలాయని అధికారులు తెలిపారు.ఈ భవనాల శిథిలాల కింద 102 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యలు చేపట్టారు. మేయర్ చార్లెస్ బుర్కెట్  ఈ ఘటన గురించి ప్రస్తావించారు.  ఈ ఘటన అత్యంత బాధాకరమైందన్నారు. భవనం కూలిపోవడానికి కచ్చితమైన కారణాన్ని  గుర్తించలేదన్నారు. 
ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !