కార్యాలయంలోనే కార్యదర్శితో రాసలీలలు: మంత్రి పదవికి హాంకాక్ రాజీనామా

Published : Jun 27, 2021, 11:14 AM IST
కార్యాలయంలోనే కార్యదర్శితో రాసలీలలు: మంత్రి పదవికి హాంకాక్ రాజీనామా

సారాంశం

కార్యదర్శితో  రాసలీలలు కొనసాగించిన మంత్రి చివరకు తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మీడియాలో మంత్రి రాసలీలలు బట్టబయలు కావడంతో  మంత్రి పదవిని కోల్పోయాడు ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హాంకాక్.

లండన్: కార్యదర్శితో  రాసలీలలు కొనసాగించిన మంత్రి చివరకు తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మీడియాలో మంత్రి రాసలీలలు బట్టబయలు కావడంతో  మంత్రి పదవిని కోల్పోయాడు ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హాంకాక్. యూకే రాజకీయాల్లో ఆరోగ్య శాఖ మ్యాట్ హాంకాక్ వ్యవహరం హాట్ టాపిక్ గా మారింది. వివాహితుడైన హాంకాక్  ఓ మహిళను తన అసిస్టెంట్ గా నియమించుకొన్నాడు. ఆమెతో తన కార్యాలయంలోనే ఆయన రాసలీలలు కొనసాగించాడు. ఆమెను ముద్దుల్లో ముంచెత్తాడు.  పీఏతో మంత్రి మ్యాట్ హాంకాక్ రాసలీలలను'ది సన్' టాబ్లాయిడ్  ప్రముఖంగా ప్రచురించింది. దీంతో విపక్షాలు  విమర్శలు మొదలుపెట్టాయి.

 ఈ ఏడాది మే 6 నుండి మే 11 మధ్య కాలంలో మ్యాట్ కార్యాలయంలోనే ఈ ఫోటోలు తీసినట్టుగా సన్ పత్రిక ప్రకటించింది.  ఈ సమయంలో దేశంలో కరోనా ఆంక్షలను ఎత్తివేయలేదని ఆ పత్రిక ప్రకటించింది. 2000 సంవత్సరంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఆ మహిళతో మంత్రికి పరిచయం ఏర్పడింది.  దీంతో ఆమెను  మే మాసంలో మంత్రి తన సహాయకురాలిగా నియమించుకొన్నాడు. కరోనా సమయంలో మంత్రి తన సహాయకురాలితో రాసలీలలకు దిగినట్టుగా సన్ పత్రిక కథనం ప్రచురించడాన్ని తొలుత మంత్రి ఖండించారు.  కానీ విమర్శలు తీవ్రతరం కావడంతో మంత్రి శనివారం నాడు రాజీనామా చేశారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !