భార‌త ఐటీ నిపుణుల‌కు ఊర‌ట‌.. పాత విధానంలోనే H-1B visa జారీ

Published : Dec 23, 2021, 10:57 AM IST
భార‌త ఐటీ నిపుణుల‌కు ఊర‌ట‌.. పాత విధానంలోనే  H-1B visa జారీ

సారాంశం

అమెరికా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. H-1B visaల జారీ విధానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ వీసాల జారీ విషయంలో గతంలో మాదిరిగా లాటరీ విధానాన్నే అనుసరించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు నార్త్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలను అమలుచేయనున్నట్టు అమెరికా అంతర్గత భద్రతా విభాగం పేర్కొంది. ఈ నిర్ణ‌యంతో భారతీయ ఐటీ నిపుణులకు తాజా పరిణామం ఊరట కల్పించనుంది.   

H-1B visa:  అమెరికాలో ఐటీ నిపుణుల ఉపాధి అవ‌కాశాల‌కు కొద‌వ ఉండ‌దు. భారీ మొత్తంలో జీతాలు ఉండ‌టం, మెరుగైన జీవ‌న ప్ర‌మాణాలు ఉంట‌డంతో  నిత్యం ల‌క్ష‌లాది మంది అమెరికాలో అడుగు పెడుతారు.  అయితే.. అక్క‌డ పని చేయ‌డానికి  విదేశీ ఉద్యోగుల‌కు తాత్కాలిక ప్ర‌తిపాదిక‌న ఉద్యోగం చేయడానికి విదేశీయులకు హెచ్-1బీ వీసా ను జారీ చేస్తారు. 

అయితే.. గ‌త కొత్త‌కాలంగా.. హెచ్-1బీ, హెచ్-4 వీసాలపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. చ్-1బీ వీసాలు వంటి వార్తలు అడపదడపా పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి. తాజాగా కూడా హెచ్-1బీ, హెచ్-4 వీసాలపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. తాజాగా ఈ వీసాల విష‌యంలో అమెరికా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ వీసాల కేటాయింపులో  పాత పద్దతిలో కేటాయించాల‌ని నిర్ణ‌యించింది. అది కూడా ‘లాటరీ’ విధానంలోనే కేటాయించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు నార్త్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలను అమలుచేయనున్నట్టు అమెరికా అంతర్గత భద్రతా విభాగం పేర్కొంది. గ‌తంలో ఈ వీసాల మీద అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆంక్షాలు విధించిన విష‌యం తెలిసిందే.. తాజా నిర్ణ‌యంతో వేలాది భారతీయ ఐటీ నిపుణులకు  ఊరట ల‌భించింది.

 Read Also: ఫైజర్ కోవిడ్ టాబ్లెట్ Paxlovid‌కు ఆమోదం తెలిపిన అమెరికా.. తొలిసారిగా..
 
అమెరికా ప్రతి ఏటా 85 వేల హెచ్‌1– బి వీసాలను జారీ చేస్తోంది. టెక్‌ కంపెనీలు, ఇతర సంస్థలు ఈ కోటాకు మించి హెచ్‌1–బి వీసా దరఖాస్తులు సమర్పిస్తే... లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి వీసాలను కేటాయించేవారు. ఈ క్ర‌మంలో  2022 ఆర్థిక సంవత్సరానికి  అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు రావ‌డంగమనార్హం. మరోవైపు.. ట్రంప్ ప్ర‌వేశపెట్టిన  వేతనాల ఆధారిత వీసా కేటాయింపు విధానాన్ని కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టు కొట్టివేసింది. దాంతో లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్‌ సర్కారు నిర్ణయించింది. ఈ నిర్ణ‌యంతో ఇతర దేశస్తుల కంటే భారత టెకీలకు అధిక ప్రయోజనం చేకూరేది.
 

Read Also: శత్రుదేశానికి అనుకోకుండా లక్షల డాలర్లు పంపిన తాలిబాన్లు.. ‘తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు’

అమెరికా జారీ చేసే వీసాలు ప్రధానంగా రెండు రకాలు. 1. ఇమిగ్రేషన్ 2. నాన్-ఇమిగ్రేషన్. అమెరికాలో స్థిరప‌డాల‌ను కునేవారికి ఇమిగ్రేషన్ వీసా ఇస్తారు. అమెరికాలో తాత్కాలికంగా కొంత కాలం ప‌ని చేయాలంటే.. వారికి నాన్-ఇమిగ్రేషన్ వీసాలు ఇస్తారు. నాన్ - ఇమిగ్రేషన్ ప‌రిధిలోకే హెచ్-1బీ వీసాలు వ‌స్తాయి.  ఈ వీసాల‌ను అమెరికా ప్రతి ఏడాదీ పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ వీసాలను జారీ చేస్తుంది. ఈ వీసాల్లో  మూడు విభాగాలుగా ఉంటాయి.

జనరల్ కోటా కింద ఏడాదికి 65,000 వీసాలు జారీ చేస్తారు. వీటి కోసం..  ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండోవ‌ది.. మాస్ట‌ర్ వీసా ..  అమెరికాలో మాస్టర్స్ చేసిన వారికి ఏడాదికి 20,000 వీసాలు ఇస్తారు. వీటికి అందరూ దరఖాస్తు చేసుకోలేరు. ఈ విభాగానికి మ‌రో ర‌కం వీసా రిజర్వ్‌డ్ వీసా..  స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా సింగపూర్, చిలీ దేశాలకు ఏడాదికి 6,800 వీసాలను రిజర్వ్ చేస్తారు.


 Read Also: ఇజ్రాయెల్ లో తొలి ఒమిక్రాన్ మరణం.. నాలుగో డోసుకు కసరత్తు...

 ఒకసారి హెచ్-1బీ వీసా లభిస్తే...  మూడేళ్లపాటు అమెరికాలో ఉండొచ్చు. ఈ కాల పరిమితిని పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. కానీ మొత్తం మీద ఆరేళ్లకు మించకూడదు.హెచ్ 1బీ వీసాల మీద అమెరికాలో ప‌ని చేసే వారి  కుటుంబ సభ్యులు డిపెండెంట్ వీసా ద్వారా అమెరికాలో ఉండొచ్చు. ఇందుకు వారు హెచ్-4 వీసాలను తీసుకోవాలి. ఈ కింద్ర హెచ్ 1భాగస్వామి, 21 ఏండ్ల‌లోపు  పిల్లలు ఉండే అవ‌కాశముంటుంది. హెచ్-4 వీసా ఉన్న కుటుంబ సభ్యులు అమెరికాలో చదువుకోవచ్చు. అయితే ఈ వీసా మీద ఎటువంటి ఉద్యోగాలు చేయడానికి వీలు లేదు. ఇందుకు వారు వర్క్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?