ఆఫ్ఘనిస్తాన్: పరిస్ధితులు బాలేదు.. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లొద్దు, దేశవాసులకు అమెరికా హెచ్చరిక

By Siva KodatiFirst Published Aug 21, 2021, 7:16 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితుల  నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది.  కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్దకు ఎవరూ వెళ్లకూడదని పౌరులకు ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్ గేట్ల వద్ద ఉద్రిక్త పరిస్ధితి వుందని ఈ సమయంలో అక్కడికి వెళ్లొద్దని ఆదేశించింది. 

కాబూల్‌లో భారతీయులను తాలిబన్లు బందీలుగా  చేయడంతో అమెరికా అలర్ట్ అయ్యింది. ఆఫ్ఘన్‌లోని ఆ  దేశ ప్రజలకు సూచనలు చేసింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ వద్ద పరిస్ధితి గందరగోళంగా వుందని.. ఎవ్వరూ వెళ్లొద్దని సూచించింది. ఎయిర్‌పోర్ట్ గేట్ల వద్ద ఉద్రిక్త పరిస్ధితి వుందని ఈ సమయంలో అక్కడికి వెళ్లొద్దని ఆదేశించింది. 

కాగా, ఆఫ్ఘాన్‌లో తాలిబన్ల చెరలో వున్న భారతీయులు క్షేమంగా వున్నారు. వారిని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విదేశాంగ శాఖ అధికారులు. అటు అమెరికాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో ఏ క్షణంలోనైనా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానంలో వారిని తరలించే అవకాశం వుంది. 

ALso Read:ఆఫ్ఘనిస్తాన్: తాలిబన్ల చెరలో వున్న భారతీయులు క్షేమం.. ఇండియా తరలింపుకు ఏర్పాట్లు..?

భారతీయులను సురక్షితంగా చూసుకుంటామని తాలిబాన్లు ఇది వరకే ప్రకటించారు. భారత దౌత్యాధికారులకూ ఎలాంటి హాని తలపెట్టబోమని వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ, తర్వాతి రోజే కాందహార్, హెరాత్‌లోని భారత కాన్సులేట్‌లలో సోదాలు చేసి అక్కడ పార్క్ చేసిన బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్స్‌ను ఎత్తుకెళ్లిన ఘటన ఆందోళన కలిగించింది. తాలిబాన్ నాయకత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న చేతలకు పొంతన లేదని స్పష్టమైంది. తాజాగా, ఈ ఉదంతం ఆ వాదనను ధ్రువీకరించినట్టయింది.

click me!