US Visa: అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు తీపికబురు

By Rajesh KarampooriFirst Published Apr 23, 2023, 12:48 PM IST
Highlights

US Indian Visa: అమెరికా వెళ్లాలనుకునే భారతీయ టెక్కీలకు అమెరికా తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది 10 లక్షలకుపైగా వర్క్‌ వీసాలను (హెచ్‌-1బీ, ఎల్‌ వర్క్ వీసాలు) జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు హెచ్-1బీ, ఎల్ వీసాల సహా ఈ ఏడాది భారతీయులను దృష్టిలో ఉంచుకుని భారీగా వీసాల జారీకి కసరత్తు చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డోనాల్డ్‌ లూ వెల్లడించారు.  

US Indian Visa: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఓ తీపి కబురు. ఈ ఏడాది 10 లక్షల మంది భారతీయులకు వీసాలు జారీ చేయనున్నట్టు ప్రకటించింది. ప్రాధాన్యతా ప్రాతిపదికన  (హెచ్‌-1బీ, ఎల్‌ వర్క్ వీసాలు) వీసా పనులు వేగవంతం కానున్నాయి. ఈ ఏడాది భారతీయుల కోసం పది లక్షలకు పైగా వీసాలు జారీ చేయనున్నట్లు అమెరికా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ వెల్లడించారు. ఈ వేసవిలో విద్యార్థి వీసాలు జారీ చేసే పనిని బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు.భారతీయుల వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు.

అమెరికా విదేశాంగ సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ ఈ వారం PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  ఉపాధి వీసాలు జారీ చేయడంపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. త్వరలో హెచ్-1బీ, ఎల్ వీసాలు జారీ చేసే పనిని ప్రారంభిస్తామన్నారు. H-1B,  L వీసాలు భారతదేశంలోని IT నిపుణులలో బాగా ప్రాచుర్యం పొందాయి. దీని సహాయంతో భారతదేశంలోని ఐటీ నిపుణులు అమెరికాలో పని చేసే అవకాశం లభిస్తుంది. దీంతో పాటు అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల విషయంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.

భారతదేశం, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం వేలాది మంది ఉద్యోగులను నియమించుకోవడానికి US టెక్ కంపెనీలు H-1B వీసాలపై ఆధారపడతాయి. ఈ ఏడాది పది లక్షలకు పైగా వీసాలు జారీ చేస్తామని అమెరికా విదేశాంగ సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ తెలిపారు. విద్యార్థి వీసాలు,H1B వీసాలను జారీ చేయనున్నట్టు తెలిపారు. బిజినెస్‌, టూరిస్ట్ వీసాల దరఖాస్తుల క్లియరెన్స్‌లో జాప్యం వల్ల భారతీయులకు ఇబ్బంది కలిగిందనీ, ఈ విషయాలన్నీ తమ దృష్టిలో ఉన్నాయని లూ అన్నారు. ఈ క్రమంలో హెచ్‌-1బీ, వీ వీసాల వెయిటింగ్ పీరియడ్‌ను కూడా 60 రోజులకు తగ్గించామని లూ తెలిపారు. 

రెండు దేశాలకు లాభదాయకం

ఈ ఏడాది చివర్లో తాము ఒక పథకాన్ని  ప్రారంభించాలనుకుంటున్నామనీ, దీంతో ఈ దరఖాస్తుదారులు తమ వీసాల పునరుద్ధరణ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. దీనితో పాటు లక్ష మంది అమెరికన్లు భారత్‌లో నివసిస్తున్నారని లూ అన్నారు. ఈ బంధం రెండు దేశాలకు లాభదాయకమని పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో హెచ్‌-1బీ, ఎల్‌ వర్క్‌ వీసాల జారీకి అమెరికా ప్రాధాన్యం ఇవ్వడం భారతీయులకు శుభపరిణామం.
 

click me!