ఫ్లైట్ అటెండాంట్‌ను లాక్కుని బలవంతంగా కిస్ చేసిన ప్రయాణికుడు.. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక అరెస్టు

By Mahesh KFirst Published Apr 23, 2023, 12:27 AM IST
Highlights

డెల్టా ఫ్లైట్‌లో ఎక్కిన ఓ ప్రయాణికుడు సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఫ్లైట్ అటెండాంట్‌ను లాక్కుని బలవంతంగా కిస్ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఆ ప్యాసింజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

న్యూఢిల్లీ: డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ఓ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు మేల్ అటెండాంట్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అతడిని తన వద్దకు బలవంతంగా లాక్కున్నాడు. మెడపై కిస్ ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు ఫైల్ అయింది.

డేవిడ్ అలానర్ బర్క్ అనే 61 ఏళ్ల ప్రయాణికుడు మిన్నెసోట నుంచి అలస్కాకు వెళ్లడానికి డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ఎక్కాడు. డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ నిబంధన ప్రకారం, ఫ్లైట్ మిన్నెసోట నుంచి బయల్దేరడానికి ముందు రెడ్ వైన్ పొందగలడు. కానీ, అతను ఆలస్యంగా వచ్చాడని, రెడ్ వైన్ సర్వ్ చేసే సమయం లేదని ఫ్లైట్ అటెండాంట్ తెలిపాడు. అయితే, ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత అటెండాంట్ టీసీ.. ఆ వ్యక్తికి గ్లాస్‌లో రెడ్ వైన్ సర్వ్ చేశాడు.

కొంత సేపటి తర్వాత బర్క్ రెస్ట్ రూమ్‌కు వెళ్లి ఫ్లైట అటెండాంట్ టీసీ ఉన్న గ్యాలే అనే చోట ఆగిపోయాడు. తాను చాలా అందంగా ఉన్నాడని టీసీకి బర్క్ కితాబిచ్చాడు. ఆ తర్వాత కిస్ చేయవచ్చా? అని బర్క్ అడిగాడు. కానీ, దానికి టీసీ నో థాంక్ యూ అని అభ్యంతరం తెలిపాడు. అప్పుడు అలాగైతే.. మెడపై కిస్ చేస్తా అని ఇచ్చాడు. ఇది టీసీకి చాలా కష్టంగా అనిపించింది.

బర్క్‌కు టీసీ ఆమోదం తెలుపలేదు. కానీ, బర్క్ చేసిన పనికి టీసీ హతాశయుడయ్యాడు. మిగిలిన ఆరు గంటల జర్నీలో ఆ అటెండాంట్ ఫ్లైట్ వెనుకాల ఉండిపోయాడు. ఆ టీసీ ప్రయాణికుడు బర్క్ పై ఫిర్యాదు చేశాడు.

Also Read: శత్రువులను పులులకు ఆహారంగా వేశారు.. మిరపకాయలతో టార్చర్ పెట్టారు.. ఆ డ్రగ్స్ ముఠా దారుణాలు

ఫ్లైట్ ల్యాండ్ కాగానే బర్క్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించగా.. తాను అలాంటిదేమీ చేయలేదని అన్నాడు. తాను టీసీ సర్వ్ చేసిన రెడ్ వైన్ మినహా మరేమీ తాగినట్టు గుర్తుకు లేదని బుకాయించాడు. ఏప్రిల్ 27వ తేదీన అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.

click me!