అమెరికాలోని స్కూల్లో కాల్పులు.. విద్యార్థి మృతి..!

Published : Sep 02, 2021, 07:59 AM IST
అమెరికాలోని స్కూల్లో కాల్పులు.. విద్యార్థి మృతి..!

సారాంశం

 ఒక దుండగుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అమెరికాలోని తుపాకీ సంస్కృతి కారణంగా.. ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఓ దుండగుడు.. తుపాకీ చేతపట్టి.. ఓ పాఠశాలలోకి ప్రవేశించి... విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. 

నార్త్‌ కరోలినా రాష్ట్రంలో విన్‌స్టన్‌ సాలెం నగరంలోని మౌంట్‌ తాబేర్‌ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఒక దుండగుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందాడు. గాయపడిన మరో విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. కరోనా మహమ్మారి కారణంగా ఏడాదికి పైగా మూతపడిన పాఠశాలలు ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇలా పాఠశాలలు తెరవగానే.. ఇలా కాల్పులు చోటుచేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా ఈ వారంలో నార్త్‌కరోలినా పాఠశాలలో కాల్పులు జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. 2018లో ఇలానే ఓ దుండగులు పాఠశాలలో దూరి కాల్పులు జరపగా.. దాదాపు 17 మంది  చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !