ప్రపంచదేశాలకు షాక్: రెమిడెసివిర్ అంతా అమెరికాకే

By narsimha lodeFirst Published Jul 2, 2020, 12:11 PM IST
Highlights

కరోనా వైరస్ ను నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేస్తోందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రెమిడెసివిర్ డ్రగ్ ను అమెరికా బుక్ చేసుకొంది.  వచ్చే మూడు నెలల పాటు అమెరికాకు మాత్రమే ఈ డ్రగ్ ను గిలీడ్ సంస్థ అందించనుంది.

వాషింగ్టన్: కరోనా వైరస్ ను నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేస్తోందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో రెమిడెసివిర్ డ్రగ్ ను అమెరికా బుక్ చేసుకొంది.  వచ్చే మూడు నెలల పాటు అమెరికాకు మాత్రమే ఈ డ్రగ్ ను గిలీడ్ సంస్థ అందించనుంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను వణికిస్తోంది. అమెరికాలో అత్యధిక కేసులు ఇప్పటికీ నమోదౌతున్నాయి. ఈ తరుణంలో రెమిడెసివిర్ అనే మందు వాడిన కరోనా రోగులు కోలుకొంటున్నట్టుగా ప్రయోగాలు వెల్లడించాయి.

దీంతో రెమిడెసివిర్ మందును గిలీడ్ అనే ఫార్మాసూటికల్  కంపెనీ తయారు చేస్తోంది.  కరోనా కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. దీంతో రానున్న మూడు నెలలపాటు గిలీడ్ లో తయారయ్యే రెమిడెసివిర్ మందు అమెరికాకే విక్రయించనుంది.

ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఇతర దేశాలకు ఈ మందు అందుబాటులో ఉండదు. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల్లో  ఐదు రోజుల పాటు ఈ డ్రగ్ ను ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తున్నాయి. 

also read:దేశంలో కరోనా విజృంభణ: ఆరు లక్షలు దాటిన కేసులు, 17 వేలు దాటిన మరణాలు

భారత్ కూడ ఈ డ్రగ్ వినియోగాన్ని సిఫారసు చేసింది. అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ అనే సంస్థ ఉత్పత్తి చేస్తోంది.ఒక్కో బాధితుడికి అవసరమయ్యే రెమిడెసివిర్  మోతాదుకు దాదాపుగా రూ. 1.77 లక్షల చొప్పున ధనిక దేశాలకు విక్రయిస్తామని గిలీడ్ సంస్థ ప్రకటించింది.

వచ్చే మూడు నెలల పాటు రెమిడెసివిర్  5 లక్షల డోసులను ఉత్పత్తి చేయనుంది. ఈ ఐదు లక్షల డోసులను అమెరికానే కొనుగోలు  చేసేలా ఈ సంస్థతొ ఒప్పందం కుదుర్చుకొంది.ఇతర దేశాలకు దక్కకుండా అమెరికా ఈ డ్రగ్ ను బుక్ చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

click me!