అమెరికాలో కరోనా బీభత్సం.. 24గంటల్లో 52వేల కేసులు

By telugu news teamFirst Published Jul 2, 2020, 9:44 AM IST
Highlights

ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి నియమాలను పాటించడం లేదని, ఇలా చేస్తే ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతాయని అమెరికాలో ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ మంగళవారం హెచ్చరించిన విషయం తెలిసిందే.

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. కాగా... ఈ వైరస్ ప్రభావం అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే.. ప్రపంచ దేశాలతో పోలిస్తే.. కరోనా కేసుల్లోనూ, మరణాల్లోనూ మొదటి స్థానంలో ఉన్న సగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. 

బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 52 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి నియమాలను పాటించడం లేదని, ఇలా చేస్తే ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతాయని అమెరికాలో ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ మంగళవారం హెచ్చరించిన విషయం తెలిసిందే.

అమెరికాలో గత 24 గంటల్లో కొత్తగా 52,898 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 27,79,953కు చేరింది. ఈ వైరస్‌ వల్ల నిన్న 706 మంది మృతిచెందారు. దీంతో అమెరికాలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 1,30,798కి పెరిగింది.

ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 11,64,680 మంది కోలుకోగా, 14,84,475 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 15,898 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. దేశంలో మంగళవారం 42,528 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే ఇప్పటివరకు రికార్డుగా ఉన్నది. 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,08,02,849 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,18,921 మంది మరణించారు. బ్రెజిల్‌లో నిన్న ఒకేరోజు 45 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,53,369కకు చేరింది. దేశంలో ఇప్పటివరకు 60,713 మంది మరణించారు.

click me!