
లవ్ చేసిన వారికి ప్రపోజ్ చేయడం చాలా కామన్. కానీ, చాలా మంది నార్మల్ గా కాకుండా డిఫరెంట్ గా ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు. కొందరు క్రికెట్ స్టేడియంలో, మరి కొందరు విమానంలో ఇలా చాలా డిఫరెంట్ ప్లేస్ లలో ప్రపోజ్ చేసిన వారు ఉన్నారు. ఆ వీడియోలు కూడా వైరల్ గా మారాయి. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా న్యూస్ యాంకర్ కి న్యూస్ చదవుతుండగా లైవ్ లో ప్రపోజ్ చేశాడు.
ఆ ప్రపోజ్ చేసిన వ్యక్తి కూడా రిపోర్టర్ కావడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.. రిలే నాగెల్ అనే రిపోర్టర్ తన సహోద్యోగి , స్నేహితురాలు, న్యూస్ యాంకర్ కార్నెలియా నికల్సన్‌కి ప్రపోజ్ చేశాడు.ఇదంతా లైవ్ లో టెలికాస్ట్ అయ్యింది. ఈ మధురమైన సంఘటన అమెరికాలోని టేనస్సీలో ప్రసారమైంది.
నికల్సన్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఈ వీడియో షేర్ చేశాడు. WRCB-TV కోసం యాంకర్ అయిన నికల్సన్, టెలిప్రాంప్టర్ నుండి వార్తలు చదువుతోంది. ఆ సమయంలోనే నాగెల్ ఓ పూల బొకే, ఉంగరంతో ఆమె వద్దకు వచ్చాడు. అతని ప్రపోజల్ కి ఆమె షాక్ అయిపోయింది. ప్రపోజ్ చేసి, పెళ్లి చేసుకుందామా అని అతను అడిగాడు. ఆమె సంతోషంలో ఏడుస్తూ, అతని ప్రపోజల్ ని ఒకే చేయడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.