ధ్వైపాక్షిక వాణిజ్యం రెండింతలు: గ్రీస్ పర్యటనలో మోడీ

Published : Aug 25, 2023, 03:45 PM ISTUpdated : Aug 25, 2023, 03:54 PM IST
ధ్వైపాక్షిక వాణిజ్యం రెండింతలు: గ్రీస్ పర్యటనలో మోడీ

సారాంశం

దక్షిణాప్రికా నుండి  గ్రీస్ దేశ పర్యటనకు  ప్రధాని మోడీ వెళ్లారు. గ్రీస్ లో ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య దైపాక్షిక అంశాలపై  చర్చించనున్నారు.

న్యూఢిల్లీ: ఇండియా, గ్రీస్ దేశాల  మధ్య వ్యాపార సంబంధాలు వేగంగా పెరుగుతున్నాయన్నారు. రెండు దేశాల మధ్య ధ్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండింతలు చేయాలని నిర్ణయించినట్టుగా ప్రధాని మోడీ చెప్పారు.

బ్రిక్స్ సదస్సు నుండి గ్రీస్ కు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నాడు చేరుకున్నారు. గ్రీస్ లో ప్రధాని మోడీకి ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా  మోడీ  మీడియాతో మాట్లాడారు.

40 ఏళ్ల తర్వాత గ్రీస్ లో అడుగు పెట్టిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీ. దక్షిణాఫ్రికా నుండి గ్రీస్ రాజధాని ఏథెన్స్ కు  మోడీ  ఇవాళ చేరుకున్నారు.
భారత్, గ్రీస్  దేశాలు  పలు అంశాలపై  పరస్పరం  సహకరించుకోనున్నాయన్నారు. ప్రపంచంలోని రెండు ప్రాచీన నాగరికతల మధ్య రెండు ప్రాచీన ప్రజాస్వామ్య సిద్దాంతాల మధ్య సహజసిద్దమైన పోటీ ఉందని  మోడీ పేర్కొన్నారు.

 

రెండు దేశాల మధ్య ధ్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.  2030 నాటికి రెండు దేశాల మధ్య  ధైపాక్షిక వాణిజ్యం రెట్టింపు చేసే దిశగా ముందుకు వెళ్తామని మోడీ ప్రకటించారు.

రక్షణ, భద్రత, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో  భారత్, గ్రీస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అంగీకరించినట్టుగా మోడీ చెప్పారు.ఇటీవలి కాలంలో తమ రెండు దేశాల మధ్య  సంబంధాలు  బాగా మెరుగుపడ్డాయని గ్రీక్ ప్రధాని మిత్సోటాకిస్ చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !