
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాల మేరకు సోమాలియాలో అమెరికా సైనిక దాడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కు చెందిన కీలక ప్రాంతీయ నాయకుడు బిలాల్ అల్-సుదానీ హతమయ్యాడని అమెరికా అధికారులు గురువారం తెలిపారు. సుడానీని పట్టుకోవచ్చనే ఉద్దేశంతో ఉత్తర సోమాలియాలోని పర్వత గుహ కాంప్లెక్స్‌పై యూఎస్ దళాలు దాడి చేశాయి. ఆ దాడిలో జరిగిన కాల్పుల్లో సుడానీ మరణించాడని యూఎస్ అధికారులు తెలిపారు.
సంఘటనా స్థలంలో సుమారు 10 మంది సుడానీ ఇస్లామిక్ స్టేట్ సహచరులు మరణించారు, అయితే అమెరికన్లకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. "జనవరి 25 న, అధ్యక్షుడి ఆదేశాల మేరకు, యూఎస్ మిలిటరీ ఉత్తర సోమాలియాలో దాడి ఆపరేషన్ నిర్వహించింది, దీని ఫలితంగా బిలాల్ అల్-సుడానీతో సహా అనేక మంది ఐఎస్ఐఎస్ సభ్యులు మరణించారు" అని డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఒక ప్రకటనలో తెలిపారు.
"ఆఫ్రికాలో ఐఎస్ఐఎస్ ఉనికిని పెంచడానికి, ఆఫ్ఘనిస్తాన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా గ్రూప్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి అల్-సుడానీ బాధ్యత వహించాడు" అని ఆస్టిన్ చెప్పారు. ఉత్తర సోమాలియాలోని తన పర్వత స్థావరం నుండి, అతను ఆఫ్రికాలో మాత్రమే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేస్తున్న ఇస్లామిక్-స్టేట్ ఖొరాసన్ అనే ఐఎస్ శాఖలకు నిధులు సమకూర్చాడు. వాటిని సమన్వయం చేశాడని యూఎస్ అధికారి ఒకరు తెలిపారు.
అతను ఇస్లామిక్ స్టేట్‌లో చేరడానికి ముందు, పదేళ్ల క్రితం సుడానీ సోమాలియాలో తీవ్రవాద అల్-షబాబ్ ఉద్యమానికి వ్యక్తులను తయారు చేయడం, శిక్షణ ఇవ్వడంలో పాల్గొనేవాడు. "సుడానీ ప్రత్యేక నైపుణ్యాలులున్నాయి. ఆయన కార్యాచరణ కీలకమైనది. ఆర్థిక పరమైన పాత్ర ఐఎస్ఐఎస్ కు వెన్నుదన్ను. వీటి కారణంగానే యూఎస్ ఉగ్రవాద నిరోధక చర్యకు సుడానీ మెయిన్ టార్గెట్ అయ్యాడు" అని అధికారి తెలిపారు.
దోషులను పట్టుకోరా .. హిందూ ఆలయాలపై ఖలిస్తానీయుల రాతలు, ఆస్ట్రేలియా సర్కార్‌పై భారత్ అసహనం
సుడానీని పట్టుకోవడానికి నెలల తరబడి శిక్షణ పొందారు. అతను దాక్కున్న ప్రాంతం డమ్మీలా నిర్మించిన సైట్‌లో యూఎస్ దళాలు నెలల తరబడి రిహార్సల్ చేసి ఆపరేషన్ కు సిద్ధం అయ్యారు. అగ్రశ్రేణి రక్షణ, ఇంటెలిజెన్స్, భద్రతా అధికారులతో సంప్రదించిన తర్వాత ఈ వారం ప్రారంభంలో బిడెన్ దాడికి అనుమతి ఇచ్చారని అధికారి తెలిపారు.
"ఈ ఆపరేషన్ ఇంటెలిజెన్స్ విలువను పెంచడానికి, క్లిష్టమైన, ఛాలెంజింగ్ భూభాగంలో కూడా యూఎస్ దళాలు టార్గెట్ ను పట్టుకునే నైపుణ్యాన్ని పెంచడానికి ఉద్దేశించిన క్యాప్చర్ ఆపరేషన్ చివరికి ఉత్తమ ఎంపికగా నిర్ణయించబడింది" అని మరొక పరిపాలన అధికారి తెలిపారు. అయితే, "ఆపరేషన్ సమయంలో వారినుంచి వచ్చిన ఎదురుదాడి వల్లే అతని మరణానికి దారితీసింది" అని అధికారి తెలిపారు.
ఈ దాడిలో ఒక అమెరికన్ ఒక సర్వీస్‌పర్సన్‌ని యూఎస్ మిలిటరీ సర్వీస్ డాగ్ కరిచిన ఒక గాయం తప్ప అమెరికన్ సైనికులకు ఎలాంటి గాయాలూ కాలేదని అధికారి జోడించారు. ‘ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదులు ఎక్కడ, ఏ మూల దాక్కున్నా తాము పట్టుకుని మరీ వారిని అంతమొందిస్తామని అధ్యక్షుడు బిడెన్ యునైటెడ్ స్టేట్స్, అమెరికన్ ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పారు" అని అధికారి తెలిపారు.
షాబాబ్ తిరుగుబాటుదారులతో పోరాడుతున్న అధికారిక దళాలకు మద్దతివ్వడానికి యూఎస్ దళాలు చాలా కాలంగా సోమాలియాలో ప్రభుత్వంతో, వారి తరపున సమన్వయంతో పనిచేస్తున్నాయి. వాటిలో కొన్ని సోమాలియాకు ఉత్తరాన జిబౌటిలో ఉన్న యూఎస్ స్థావరం నుండి నిర్వహించబడుతున్నాయని అంచనా. 2017-2020 మధ్య కాలంలో సోమాలియాలో సంవత్సరానికి డజన్ల కొద్దీ యూఎస్ వైమానిక దాడులు జరిగేవి. అదే సమయంలో యేటా, రెండు నుండి నాలుగు గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా చేసేవారు.
2021లో బిడెన్ ప్రెసిడెంట్ అయిన తరువాత, 2022లో వైమానిక దాడులు కేవలం 16కి పడిపోయాయి. జాతీయ భద్రతా థింక్ ట్యాంక్ అయిన న్యూ అమెరికా సంకలనం చేసిన డేటా ప్రకారం ఎటువంటి గ్రౌండ్ అటాక్స్ నమోదు కాలేదు.