దోషులను పట్టుకోరా .. హిందూ ఆలయాలపై ఖలిస్తానీయుల రాతలు, ఆస్ట్రేలియా సర్కార్‌పై భారత్ అసహనం

By Siva KodatiFirst Published Jan 26, 2023, 5:01 PM IST
Highlights

ఆస్ట్రేలియాలోని హిందూ ఆలయాలే టార్గెట్‌గా గత కొంతకాలంగా జరుగుతున్న దాడులపై భారత ప్రభుత్వం స్పందించింది. సంఘ విద్రోహ శక్తుల్ని కీర్తిస్తూ గీసిన గ్రాఫిటీల వ్యవహారం ఆందోళనకారంగా వుందని దుయ్యబట్టింది.

ఆస్ట్రేలియాలోని హిందూ ఆలయాలే టార్గెట్‌గా గత కొంతకాలంగా జరుగుతున్న దాడులపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనలు జరిగి రోజులు గడుస్తున్నా దుండగులను పట్టుకోలేకపోవడంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు కాన్‌బెర్రాలోని భారత హైకమీషన్ గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. సంఘ విద్రోహ శక్తుల్ని కీర్తిస్తూ గీసిన గ్రాఫిటీల వ్యవహారం ఆందోళనకారంగా వుందని దుయ్యబట్టింది. అలాగే ఇండో ఆస్ట్రేలియన్ కమ్యూనిటీల మధ్య విద్వేషం రగిల్చేలా ఈ చర్యలు వున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 

ఖలిస్తానీ అనుకూల శక్తులు ఆస్ట్రేలియాలో తమ కార్యకలాపాలను ఉద్ధృతం చేశాయని భారత్ అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దాడికి పాల్పడిన వాళ్లను గుర్తించ, కఠిన శిక్షలు విధించాలని కోరింది. కాగా.. ఈ నెల ఆరంభంలో మెల్‌బోర్న్‌లోని స్వామి నారాయణ్ ఆలయం, విక్టోరియా కర్రమ్ డౌన్స్‌లోని శ్రీ శివ విష్ణు ఆలయం, మెల్‌బోర్న్‌లోని ఇస్కాన్ టెంపుల్‌పై దాడులు జరిగాయి. వీటిపై భారతదేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా రాతలు రాశారు ఖలిస్తాన్ తీవ్రవాదులు. 

ALso REad: ఆస్ట్రేలియాలో మళ్లీ హిందూ దేవాలయం ధ్వంసం.. గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాసిన దుండగులు..

ఇకపోతే.. భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. మెల్‌బోర్న్‌లోని రెండు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఆస్ట్రేలియా గర్వించదగిన, బహుళ సాంస్కృతిక దేశం అని తెలిపారు. వ్యక్తీకరణ స్వేచ్ఛకు తమ బలమైన మద్దతులో ద్వేషపూరిత ప్రసంగం, హింస లేదని ఆయన నొక్కి చెప్పారు. ఈ విషయంపై భారత్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు చర్చించుకున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ‘‘మేము ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము’’ అని ఆయన అన్నారు. మెల్బోర్న్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ స్థానిక పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. 

జనవరి 11న ఆస్ట్రేలియాలోని మిల్ పార్క్‌లోని బీఏపీఎస్ సంస్థా మందిర్‌పై భారతదేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక నినాదాలు రాశారు.  గోడలపై "హిందూస్థాన్ ముర్దాబాద్", "మోడీ హిట్లర్"  అంటూ పేర్కొన్నారు. కారమ్ డౌన్స్‌లోని రెండో హిందూ దేవాలయం, శ్రీ శివ విష్ణు మందిరం జనవరి 15-16 మధ్య రాత్రి సమయంలో మధ్య దాడి జరిగింది. ఈ ఘటన 17వ తేదీన వెలుగులోకి వచ్చింది. 18వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

click me!