ట్రంప్ ఉత్తర్వులు రద్దు.. వలసదారులకు బైడెన్ ఊరట

By telugu news teamFirst Published May 15, 2021, 3:02 PM IST
Highlights

అమెరికాలోకి వచ్చిన వలసదారులు 30 రోజుల్లోగా ఆరోగ్య బీమాను తీసుకోవాలని లేదా వైద్య ఖర్చులు భరించే స్తోమత తమకు ఉందని నిరూపించుకోవాలని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అమెరికా వచ్చే వలసదారులకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఊరట కల్పించారు. వలసదారుల విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతంలో ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ ఉత్తర్వులను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. వైద్య సేవల కోసం అయ్యే ఖర్చును భరించలేని వలసదారులు అమెరికాకు రాకుండా డొనాల్డ్ ట్రంప్ 2019 ఉత్తర్వులు జారీ చేశాడు. అమెరికాలోకి వచ్చిన వలసదారులు 30 రోజుల్లోగా ఆరోగ్య బీమాను తీసుకోవాలని లేదా వైద్య ఖర్చులు భరించే స్తోమత తమకు ఉందని నిరూపించుకోవాలని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు అమెరికా వెళ్లాలనుకునే వలదారులకు ఇబ్బందికరంగా మారాయి. తాజాగా జో బైడెన్ ఈ ఉత్తర్వులను రద్దు చేశారు. 

ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు అమెరికా ప్రయోజనాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని జో బైడెన్ పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆరోగ్య బీమాను కొనుగోలు చేయలేని వలసదారులపై నిషేధం వధించకుండానే ఆ లక్ష్యం చేరుకోగలమనే నమ్మకం ఉందని బైడెన్ స్పష్టం చేశారు. 

click me!