ఇజ్రాయెల్- హమాస్ దాడులు... పాలస్తీనియన్ సినీనటిపై కాల్పులు

By Siva KodatiFirst Published May 14, 2021, 5:26 PM IST
Highlights

ప్రస్తుతం ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గడిచిన కొన్ని రోజులుగా హమాస్ తీవ్రవాదులు- ఇజ్రాయెల్ దళాలు దాడి, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. 

ప్రస్తుతం ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గడిచిన కొన్ని రోజులుగా హమాస్ తీవ్రవాదులు- ఇజ్రాయెల్ దళాలు దాడి, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా చోటు చేసుకున్న ఘర్షణలో ఒక సినీ నటిపై కాల్పులు జరిగాయి.

అయితే అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. తన కాలికి బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయమైందని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే శాంతియుతంగా కొనసాగుతున్న నిరసనపై పోలీసులు కాల్పులు జరపడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.

Also Read:గాజాపై ఇజ్రాయిల్ వైమానిక దాడి: 35 మంది మృతి

పాలస్తీనాకు చెందిన మైసా అబ్ద్ ఎల్హాది అనే నటి.. ఇజ్రియెల్-పాలస్తీనా దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణకు వ్యతిరేకంగా కొంతమందితో కలిసి నిరసన చేపట్టారు. తూర్పు జెరూసలెంలోని పాలస్తీనియన్లు అక్కడి నుంచి బలవంతంగా తమ మకాం మార్చాల్సి రావడాన్ని, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడుల్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆమె బృందంపై ఇజ్రాయెల్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అబ్ద్ ఎల్హాదికి గాయాలయ్యాయి.

పాలస్తీనాకు ముప్పు ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా దాడి చేయడానికి పోలీసులు, ఆక్రమణ దళాలు వెనుకాడవని ఆమె ఎద్దేవా చేశారు. శాంతియుత నిరసనకారులపై పోలీసులు, సైన్యం దాడి చేయడం ఇదే తొలిసారి కాదని అబ్ధ్ అన్నారు. పాలస్తీనియన్‌గా తాను నిరంతరం ఇలాంటి ముప్పును ఎదుర్కొంటున్నాను. కాని ఈసారి తాము యుద్ధరంగంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!