జూలో ఉన్నట్లు ఉండేది.. బ్రిటన్ రాజకుటుంబంపై ప్రిన్స్ హ్యారీ

Published : May 15, 2021, 09:59 AM ISTUpdated : May 15, 2021, 11:30 AM IST
జూలో ఉన్నట్లు ఉండేది.. బ్రిటన్ రాజకుటుంబంపై ప్రిన్స్ హ్యారీ

సారాంశం

‘ ది ట్రూమన్ షో’ లో హీరోలాగా తాను అనుక్షణం కెమేరాల నిఘాలో బతికానని ఆయన చెప్పుకొచ్చారు. గతంలోనూ చాలా సార్లు రాజకుటుంబం నుంచి విడిపోవాలనే ఆలోచనలు తనకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

బ్రిటన్ రాజకుటుంబంతో ప్రిన్స్ హ్యారీ సంబంధాలు తెంచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలోనూ రాజకుటుంబంపై సంచలన కామెంట్స్ చేసిన హ్యారీ.. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం.

రాజ కుటుంబంలో తన అనుభవాన్ని ఆయన జూ( జంతు ప్రదర్శన శాల) తో పోల్చడం గమనార్హం. 1998లో వచ్చిన ‘ ది ట్రూమన్ షో’ లో హీరోలాగా తాను అనుక్షణం కెమేరాల నిఘాలో బతికానని ఆయన చెప్పుకొచ్చారు. గతంలోనూ చాలా సార్లు రాజకుటుంబం నుంచి విడిపోవాలనే ఆలోచనలు తనకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

భార్య మేఘన్, కొడుకు ఆర్చీ గురించి ఆందోళన పడేవాడినని... వారు కూడా తన తల్లి డయానాలా ఇబ్బంది పడతారేమోనన్న భయం తనను వెంటాడేదని పేర్కొన్నారు. 1997లో కారు ప్రమాదంలో డయానా చనిపోయిన సంగతి తెలిసిందే.

అప్పట్లో బ్రిటన్ పత్రికలు, ప్రచార సాధనాల దృష్టి ఆమెపైనే ఉండేది అని ప్రిన్స్ హ్యారీ పేర్కొన్నారు. ‘‘ నా తల్లికి జరిగింది చూసిన తర్వాత రాజ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలని అనిపించలేదు’’ అని హ్యారీ పేర్కొనడం గమనార్హం. 
 

PREV
click me!

Recommended Stories

Petrol Price: రూపాయికే లీట‌ర్ పెట్రోల్‌.. ఇంత త‌క్కువ ధ‌ర‌కు కార‌ణం ఏంటో తెలుసా.?
Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..