
న్యూఢిల్లీ: క్వాడ్ సదస్సులో పాల్గొనడానికి ఆస్ట్రేలియా, భారత్, అమెరికా దేశాల నేతలు జపాన్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు దేశాల నేతలు క్వాడ్ సదస్సులో మాట్లాడుతున్నారు. క్వాడ్ సదస్సు జరుగుతుండగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన భారత్‌పై ప్రశంసలు కురిపించినట్టు తెలిసింది. కరోనా మహమ్మారిని ప్రజాస్వామికంగా ఎదుర్కోవడంలో భారత్ విజయం సాధించిందని అన్నారు. అదే చైనా మాత్రం విఫలం అయిందని ఆరోపించినట్టు సీనియర్ అధికారులు కొందరు తెలిపారు.
ఈ రెండు దేశాలు పోల్చదగిన సైజు కలిగి ఉన్నాయని, కానీ, ఈ రెండు దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భిన్న మార్గాల్లో వెళ్లాయని, అందులో ప్రజాస్వామిక చర్యలతో భారత్ కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొంటే.. చైనా మాత్రం వైఫల్యం చెందిందని బైడెన్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ విజయంతో.. ప్రజాస్వామ్యాలు సత్ఫలితాలు ఇస్తాయనే విషయం మరోసారి రూఢీ అయిందని వివరించారు. అదే విధంగా ఏకఛత్రాధిపత్య పాలన ద్వారా వేగవంతమైన నిర్ణయాలు తీసుకుని ఏ సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చనే కాల్పనిక వాదనల డొల్లతనం కూడా తేటతెల్లం అయిందని వివరించారు. ప్రజాస్వామిక దేశాలు ఏ నిర్ణయం తీసుకోవాలన్న సుదీర్ఘమైన ప్రక్రియ ద్వారా సాధ్యం అవుతుందని, తద్వారా సత్ఫలితాలు రాబట్టడంలో వైఫల్యాలు మూటగట్టుకుంటాయన్న వాదనలను ఈ విజయం పటాపంచలు చేసిందని పేర్కొన్నారు.
క్వాడ్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముందస్తుగా ప్రిపేర్ అయిన మాటలు మాట్లాడారని, కానీ, ఈ వ్యాఖ్యలు మాత్రం అప్పటికప్పుడు మాట్లాడినట్టుగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకంగా కలుగజేసుకుని ఈ కామెంట్లు చేశారని వివరిస్తున్నారు.
ఈ రోజు క్వాడ్ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిపారు.
Tokyoలో కీలకమైన quad summitను ప్రారంభించిన ప్రధాని Narendra Modi, క్వాడ్ ప్రయత్నాలు స్వేచ్ఛా, బహిరంగ, సమ్మిళిత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. పరస్పర విశ్వాసం, దృఢ సంకల్పం ప్రజాస్వామ్య సూత్రాలకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయని, క్వాడ్ ప్రపంచ ప్రాధాన్యాన్ని సంతరించుకుందని అన్నారు.
"క్వాడ్ స్థాయిలో, మా పరస్పర సహకారంతో, ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూసివ్ ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రోత్సహించబడుతోంది - ఇదే మనందరి ఉమ్మడి లక్ష్యం:" అన్నారు.
"ఇంత తక్కువ సమయంలో ప్రపంచం ముందు క్వాడ్ తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. నేడు, క్వాడ్ పరిధి విస్తృతమైంది, దాని రూపం ప్రభావవంతంగా మారింది. మన పరస్పర విశ్వాసం, మన సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయి," అని ప్రధాన మంత్రి మోదీ జోడించారు.
కోవిడ్-19 ప్రతికూల పరిస్థితులను సృష్టించినప్పటికీ, వ్యాక్సిన్ డెలివరీ, వాతావరణ చర్య, సప్లై చెయిన్ ముందూ, వెనకలవ్వడం... విపత్తు ప్రతిస్పందన, ఆర్థిక సహకారం, ఇతర రంగాలలో సమన్వయం పెంచబడింది. ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది అన్నారు.