Saudi Arabia: అప్ర‌మ‌త్త‌మైన సౌదీ అరేబియా.. భారత్‌ సహా 16 దేశాలపై ప్రయాణ ఆంక్షలు

Published : May 24, 2022, 06:18 AM IST
Saudi Arabia: అప్ర‌మ‌త్త‌మైన సౌదీ అరేబియా.. భారత్‌ సహా 16 దేశాలపై ప్రయాణ ఆంక్షలు

సారాంశం

 Saudi Arabia: కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా అప్ర‌మ‌త్తమైంది. భారత్‌ సహా 16 దేశాలపై సౌదీ అరేబియా ప్రయాణ ఆంక్షలు విధించింది.   

Saudi Arabia: భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమణ కేసులు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. చాలా దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్ర‌మంలో సౌదీ అరేబియాలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ఇలాంటి పరిస్థితిలో సౌదీ ప్రభుత్వం భారతదేశం సహా 16 దేశాలకు ప్రయాణాన్ని నిషేధించింది. అయితే ఇప్పటి వరకు దేశంలో ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వం ప్రజలకు తెలిపింది. భారతదేశంతో పాటు రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లిబియా, ఇండోనేషియా, లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, వియత్నాం, అర్మేనియా, బెలారస్ దేశాల‌పై సౌదీ అరేబియా ప్ర‌యాణ ఆంక్ష‌లు విధించింది. 

అయితే ఈ 16 దేశాల మినహా మిగతా ప్ర‌పంచ‌ దేశాలకు చెందిన వాళ్లు యధావిధిగా రాకపోకలు సాగించ‌వ‌చ్చ‌ని పేర్కొంది. అయితే ఎవరైనా సౌదీ విడిచి వెళాల్సి వస్తే తప్పనిసరిగా మూడు డోసులు తీసుకొని ఉండాలని నిబంధన విధించింది. పన్నెండు నుంచి పదహారేళ్ల లోపు వయసు వాళ్లకు రెండు డోసులు ఉంటే చాలని ప్రకటించింది. ఆరోగ్యపరమైన మినహాయింపులు ఉంటే తప్ప.. ఎవరినీ బయటకు పంపేది లేదని సౌదీ స‌ర్కార్ క్లారిటీ ఇచ్చింది.  

ఉత్తర కొరియాలో కరోనా కలకలం సృష్టించింది.  అక్క‌డ ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సౌదీలో తాజాగా 414 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయని సౌదీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. మార్చి, ఏప్రిల్ నెలలలో పోల్చితే ఈసారి కేసుల నమోదు ఇది ఐదు రెట్లు పెరగడంపై  ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి తోడు ఏకంగా 81 కరోనా మరణాలు చోటుచేసుకోవడంతో ట్రావెల్‌ బ్యాన్‌ విధించింది సౌదీ స‌ర్కార్. 

సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో, దేశంలో ఇప్పటివరకు ఒక్క మంకీపాక్స్ కేసు నమోదు కాలేదని పేర్కొంది. మంకీపాక్స్ కేసులను గుర్తించే సామర్థ్యం దేశానికి ఉందని ప్రివెంటివ్ హెల్త్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ అబ్దుల్లా అసిరి అన్నారు. ఏదైనా కేసు తెరపైకి వస్తే, అంటువ్యాధిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌పై దేశాలను కూడా అప్రమత్తం చేస్తుంది. అయితే, భారతదేశంలో ఇప్పటి వరకు.. ఈ వేరియంట్ కేసులు నమోదు కానప్పటికీ.. భార‌త ప్రభుత్వం అప్ర‌మ‌త్తంగా ఉంది.

 మంకీపాక్స్ ఎంత ప్రాణాంతకం?

మంకీపాక్స్ అనేది మశూచిని పోలి ఉండే వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ఎలుకలు, ముఖ్యంగా కోతుల నుండి మానవులకు సంక్రమిస్తుంది. ఇది మొదటిసారిగా 1958లో కనుగొనబడింది. 1970లో మంకీపాక్స్‌తో సంక్రమించిన మొదటి కేసు నమోదైంది. ఈ వ్యాధి ప్రధానంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వర్షారణ్య ప్రాంతాలలో సంభవిస్తుంది. కొన్నిసార్లు ఇది ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. ప్రస్తుతం ఆఫ్రికా వెలుపల, అమెరికా, యూరప్, సింగపూర్, బ్రిటన్‌లలో మంకీపాక్స్ కేసులు ఉన్నాయి. 

WHO అప్రమత్తం

ఇదిలావుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 11 దేశాల్లో 80 మంకీపాక్స్ కేసులను నిర్ధారించబ‌డ్డాయి. WHO మంకీపాక్స్ యొక్క పరిధిని, కారణాన్ని బాగా అర్థం చేసుకోవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అనేక దేశాలలో ఈ వైర‌స్  జంతువుల మధ్య వ్యాప్తి చెందుతుందని, స్థానికులు, ప్రయాణికులలో అప్పుడప్పుడు వ్యాప్తి చెందుతుందని WHO తెలిపింది.

మ‌రోవైపు .. కరోనా బారిన ప‌డిన వారు.. భ‌విష్య‌త్తులో పార్కిన్సన్స్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువని థామస్‌ జెఫర్సన్‌ వర్సిటీ, న్యూయార్క్‌ వర్సిటీ శాస్త్రజ్ఞులు ఎలుకలపై చేసిన పరిశోధనలో వెల్లడైంది. 1918లో స్పానిష్‌ ఫ్లూ మహమ్మారి వ్యాపించినప్పుడు కూడా ఇలాగే ప్రపంచవ్యాప్తంగా పార్కిన్సన్స్‌ కేసులు బాగా పెరిగాయని  గుర్తుచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. భారతదేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 14,832కు తగ్గింది. మంగళవారం దేశవ్యాప్తంగా 2,022 కేసులు, 46 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటిదాకా దేశంలో 4,31,38,393  కేసులు న‌మోదు కాగా..  5,24,459 మరణాలు సంభ‌వించాయి. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !