రిపోర్టర్ పై నోరు పారేసుకున్న జో బిడెన్.. అసభ్య పదజాలంతో తిడుతూ...

Published : Jan 25, 2022, 10:05 AM IST
రిపోర్టర్ పై నోరు పారేసుకున్న  జో బిడెన్.. అసభ్య పదజాలంతో తిడుతూ...

సారాంశం

ప్రెస్ మీట్ లో భాగంగా యునైటెడ్ స్టేట్స్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం గురించి అడిగిన  ఫాక్స్ న్యూస్ కరస్పాండెంట్ పీటర్ డూసీని బిడెన్ ఎగతాళి చేశాడు. "అది గొప్ప ఆస్తి. మరింత ద్రవ్యోల్బణం? ఎంత తెలివితక్కువ..దద్దమ్మవి... (stupid son of a bitch)" అంటూ బిడెన్ దూషించాడు. ఇది రికార్డ్ అవ్వడంతో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. 

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు Joe Biden మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. సోమవారం ఓ press conference లో జరిగిన సంభాషణతో బిడెన్ హాట్ మైక్‌లో చిక్కుకున్నారు, inflation సమస్యపై జర్నలిస్ట్ అడిగిన ఒక ప్రశ్న సమయంలో ఇది జరిగింది. ద్రవ్యోల్బణం మీద US వార్తా నెట్‌వర్క్‌కు చెందిన కరస్పాండెంట్‌ అడిగిన ప్రశ్నకు బిడెన్ vulgar epithetతో మాట్లాడారు. అది రికార్డ్ అయ్యింది.

ప్రెస్ మీట్ లో భాగంగా యునైటెడ్ స్టేట్స్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం గురించి అడిగిన  ఫాక్స్ న్యూస్ కరస్పాండెంట్ పీటర్ డూసీని బిడెన్ ఎగతాళి చేశాడు. "అది గొప్ప ఆస్తి. మరింత ద్రవ్యోల్బణం? ఎంత తెలివితక్కువ..దద్దమ్మవి... (stupid son of a bitch)" అంటూ బిడెన్ దూషించాడు. ఇది రికార్డ్ అవ్వడంతో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. 

అయితే, జో బిడెన్ దాన్ని బైటికి గట్టిగా అనకపోవడం.. అయినా hot mic తో ఇది అందరినీ వినిపించడంతో.. తన మైక్ ఇంకా ఆన్‌లో ఉందని బిడెన్‌కు తెలుసా? తెలిసే అలా అన్నాడా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

అయితే బిడెన్ ను రిపోర్టర్ ప్రశ్నించడం.. బిడెన్ సమాధానం ఇవ్వడం కూడా కెమెరాకు చిక్కింది. ద్రవ్యోల్బణం రాజకీయ బాధ్యత అని మీరు భావిస్తున్నారా?’’ అని డూసీ అడిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఫాక్స్ పాస్ బిడెన్‌ను వెలుగులోకి తెచ్చిన సంఘటనల్లో ఇది తాజాది.

ఇతర సందర్భాల్లోనూ, బిడెన్ తనకు నచ్చని విషయాల మీద ప్రశ్నిస్తే రిపోర్టర్లను దూషించాడని న్యూయార్క్ పోస్ట్ వార్తాపత్రిక నివేదించింది. గత వారం, బిడెన్ ఒక మహిళా ఫాక్స్ న్యూస్ రిపోర్టర్‌పై కూడా ఇలాగే దాడి చేశాడు "సర్, (రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్) పుతిన్ కోసం మీరు ఎందుకు వేచి ఉన్నారు?" దానికి బిడెన్, "ఏమిటి తెలివితక్కువ ప్రశ్న" అని బదులిచ్చారు.

ఇదిలా ఉండగా, Afghanistan నుండి వైదొలగాలనే తన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు Joe Biden జనవరి 20 బుధవారం సమర్థించుకున్నారు. "నేను చేసిన దానికి నేను apologieలు చెప్పను" అని అన్నారు. తన పరిపానల యేడాది పూర్తైన సందర్భంగా వైట్ హౌస్ లోని ఆఫీసులో ఆయన మాట్లాడుతూ..ఇలా వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్థాన్ నుంచి అంత తేలికగా బయటపడే మార్గం లేదు. అది ఏ సందర్భంలోనూ సాధ్యం కాదు. నేను చేసిన దానికి నేను క్షమాపణలు చెప్పను." అన్నారు.

అయితే, ఆగస్టు మధ్యలో talibans దేశాన్ని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో సంక్షోభం పట్ల బిడెన్ తన సానుభూతిని వ్యక్తం చేశారు. "తాలిబాన్ అసమర్థత ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఏం జరుగుతోందో" అని తాను బాధపడ్డానని తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలగాలన్న తన నిర్ణయాన్ని సమర్థిస్తూ, బిడెన్ ఈ ఓటమికి అంతకు ముందు ప్రభుత్వాలను నిందించాడు. "ఇప్పటికీ మనం బైటికి రాకుండా, అక్కడే ఉండి.. మరిన్ని బలగాలను రంగంలోకి దించితే.. తాలిబాన్ల అసమర్థత ఫలితంగా ఏమి జరుగుతుందోనని నాకు బాధగా ఉండదా? అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?