అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి: కీలక ప్రకటన చేసిన డొనాల్డ్ ట్రంప్

By Siva KodatiFirst Published Jan 8, 2020, 10:15 PM IST
Highlights

ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ చేసిన క్షిపణి దాడిలో తమ సైనికులు ఎవ్వరికీ గాయపడలేదన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అణుబాంబును చిక్కనివ్వమన్నారు. 

ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ చేసిన క్షిపణి దాడిలో తమ సైనికులు ఎవ్వరికీ గాయపడలేదన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇరాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అణుబాంబును చిక్కనివ్వమన్నారు.

Also Read:ఉక్రెయిన్ విమాన ప్రమాదంలో మిస్టరీ: ఇరాన్, అమెరికాపైనే అనుమానాలు..?

ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఖాసీం సోలేమానీని చంపడం తప్పేమి కాదని ట్రంప్ పేర్కొన్నారు. సోలేమానీ.. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు మద్ధతు ఇచ్చారని.. ఉగ్రవాదాన్ని కొనసాగనివ్వమన్నారు.

సులేమానీని గతంలోనే చంపాల్సి ఉందని, ఇరాన్ దారికి రాకుంటే కఠిన ఆంక్షలు విధిస్తామని, ప్రపంచం ఆ దేశాన్ని ఒంటరిని చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ఇరానే కారణమని ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్ తక్షణం తన అణ్వాయుధ కార్యక్రమాలను విరమించుకోవాలని అగ్ర రాజ్యాధినేత హెచ్చరించారు. 

సులేమానీ మృతికి ప్రతీకారం తీర్చుకొంటామని ప్రకటించిన ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై బుధవారం నాడు తెల్లవారుజామున దాడికి దిగింది. ఇందులో భాగంగానే అమెరికా దాని మిత్రదేశాలు పై దాడులు తప్పవని హెచ్చరించింది. పశ్చిమ దేశాలనుంచి అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ -అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది 

Also Read:సులేమానీ హత్యకు ప్రతీకారం: అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడి

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ రకమైన దాడులు యుద్దానికి దారితీస్తాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ సైన్యం అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడడాన్ని పెంటగాన్ అధికారులు సమీక్షించారు. ఎంత నష్టం వాటిల్లిందనే విషయమై అధికారులు ప్రాథమిక నివేదికను తయారు చేస్తున్నారు.

పశ్చిమ ఇరాక్ లో యూఎస్ నేతృత్వంలోని పశ్చిమాసియా బలగాలు 2003 నుండి ఉన్నాయి.2018లో ట్రంప్ ఈ సైనిక స్థావరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో ఇస్లామిక్ స్టేట్ గురించి వ్యాఖ్యలు చేశారు.

click me!