ఇరాన్ లో ఘోర విమాన ప్రమాదం... 167మంది మృతి

Published : Jan 08, 2020, 09:24 AM ISTUpdated : Jan 08, 2020, 11:05 AM IST
ఇరాన్ లో ఘోర విమాన ప్రమాదం... 167మంది మృతి

సారాంశం

ప్రమాద సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, ఇతర విమాన సిబ్బంది ఉన్నారు. కాగా... ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారు అనే విషయంపై క్లారిటీ రాలేదు

ఇరాన్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. టెహ్రాన్ ఎయిర్ పోర్టు సమీపంలో విమానం కుప్ప కూలింది. ఉక్రెయిన్ నుంచి విమానం బయలు దేరింది. కాగా.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో విమానంలో 167మంది ప్రయాణిస్తుండగా.. వారిలో 160మంది ప్రయాణికులు కాగా... మరో ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు. 

కాగా... ఈ ఘటనలో విమానం పూర్తిగా కాలి బూడిదయ్యింది. కనీసం ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడకపోవడం విషాదకరం. ఈ విషయాన్ని రష్యన్ టుడే ధ్రువీకరించింది.  ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 737గా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని సంబంధిత అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.


 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?