
బాల్టిమోర్ : ప్రపంచ వైద్య చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పంది గుండెను శస్త్రచికిత్స ద్వారా అమర్చిన వ్యక్తి మృతి చెందారు. డేవిడ్ బెన్నెట్ (57) రెండు నెలల క్రితం అమెరికాలోని మేరీలాండ్ ఆస్పత్రిలో గుండె మార్పిడి జరిగింది. అవయవాల మార్పిడిలో కీలకమైన ముందడుగుగా ఈ శస్త్రచికిత్సలు భావించారు. ఈ కొద్దిరోజులుగా అతని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని, మంగళవారం తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు బుధవారం ప్రకటించాయి. అయితే మరణానికి కచ్చితమైన కారణాన్ని వివరించలేదు.
వివిధ రుగ్మతలతో చావుకు దగ్గరగా ఉన్న తన తండ్రికి ఈ ఏడాది జనవరి 7న అరుదైన గుండె మార్పిడి చికిత్స జరిగిందని, తద్వారా ఆయనను బతికించేందుకు ఆసుపత్రి వైద్యులు అపూర్వమైన కృషి చేశారని డేవిడ్ బెన్నెట్ కుమారుడు బెన్నెట్ జూనియర్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో జంతువుల అవయవాలను అమర్చిన ప్రయోగాలు విఫలమయ్యాయి. దీంతో మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ ఆసుపత్రి వైద్యులు జన్యుమార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను డేవిడ్ బెన్నెట్ కు అమర్చారు. 1984 లో ఒక రకం కోతి గుండెను బేబీ ఫే అనే వ్యక్తికి అమర్చగా 21 రోజులు మాత్రమే జీవించారు. ఆ శస్త్ర చికిత్సతో పోల్చితే డేవిడ్ బెన్నెట్ పై జరిగిన ప్రయోగం మెరుగైన ఫలితాలను సాధించింది అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
కాగా, ఈ యేడు జనవరి 11న ప్రపంచంలోనే తొలిసారిగా అద్భుతం జరిగింది. Heart diseaseతో బాధపడుతున్న ఓ వ్యక్తికి Pig heartను ట్రాన్స ప్లాంట్ చేశారు. ఇలా చేయడం ఇదే తొలిసారి. కాగా పందిగుండె అమర్చిన వ్యక్తి కూడా ఆ సమయంలో ఆరోగ్యంగా ఉండడంతో హృదయవ్యాధి గ్రస్తుల్లో కొత్త ఆశను చిగురించేలా చేసింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ రోగి ప్రాణాలను కాపాడే చివరి ప్రయత్నంగా వైద్యులు అతనికి పంది గుండెను మార్పిడి చేశారు. అత్యంత ప్రయోగాత్మకంగా జరిగిన ఈ Surgery జరిగిన.. మూడు రోజుల తర్వాత అతను బాగానే ఉన్నాడని మేరీల్యాండ్ ఆసుపత్రి సోమవారం తెలిపింది.
genetically altered చెందిన పంది గుండెను అమర్చిన ఈ ఘటన అవయవమార్పిడికి జంతు అవయవాలు అనే ఓ కొత్త పురోగతికి బాటలు వేసినట్టయ్యింది. ఆశాకిరణంగా మారింది. వివరాల్లోకి వెడితే.. ప్రాణాంతక గుండె జబ్బుతో బాధపడుతున్న 57 ఏళ్ల వ్యక్తి జన్యుపరంగా మార్పు చెందిన పంది నుండి గుండెను అమర్చారు. పంది గుండెను మానవునికి విజయవంతంగా మార్పిడి చేయడం ఇది మొదటిసారి. శుక్రవారం బాల్టిమోర్‌లో ఈ ఆపరేషన్ ఎనిమిది గంటల పాటు కొనసాగింది. పందిగుండె అమర్చిన తరువాత మేరీల్యాండ్‌కు చెందిన డేవిడ్ బెన్నెట్ సీనియర్ సోమవారం బాగానే ఉన్నారని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్‌లోని సర్జన్లు తెలిపారు.
ఆపరేషన్ తరువాత మామూలు మనిషి గుండెలాగే.. అది పనిచేస్తోందని, అది చూసి తాము థ్రిల్ అయ్యామని ఆపరేషన్ చేసిన మెడికల్ సెంటర్‌లోని కార్డియాక్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ అన్నారు. యునైటెడ్ నెట్‌వర్క్ ఫర్ ఆర్గాన్ షేరింగ్ ప్రకారం.. నిరుడు దాదాపు 41,354 మంది అమెరికన్లు అవయవ మార్పిడి చేయించుకున్నారు. వారిలో సగానికి పైగా కిడ్నీ పేషెంట్లే. అయితే అవయవాలకు తీవ్ర కొరత ఉంది. ఆర్గాన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రతి రోజు డజను మంది మరణిస్తున్నారు. దాదాపు 3,817 మంది అమెరికన్లకు నిరుడు ఆర్గాన్ డోనర్స్ నుంచి హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. ఇది గతంలో కంటే ఎక్కువ.
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకునే మానవ శరీరం తిరస్కరించని.. పందులను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొత్త జన్యు సవరణ, క్లోనింగ్ టెక్నాలజీల ద్వారా గత దశాబ్దంలో పరిశోధన వేగవంతం అయ్యింది. దీనికి కొద్ది నెలల ముందే న్యూయార్క్‌లోని సర్జన్లు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయబడిన పంది కిడ్నీని అమర్చి విజయవంతం అయ్యారు.
కిడ్నీలు, ఇతర అవయవాల కోసం ఎదురుచూస్తున్న అర మిలియన్ కంటే ఎక్కువ మంది అమెరికన్లకు ఇలాంటి విధానాలు భవిష్యత్తులో వైద్యరంగంలో కొత్త ఆశాకిరణంగా కనిపిస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే అన్నిసార్లూ ఇది ఫలించదని కూడా వైద్యులు చెబుతున్నారు. అన్నిరకాలుగా పరీక్షలు చేసి సరిపోతుందని నిర్దారణ తరువాత ట్రాన్స్ ప్లాంట్ చేసిన మానవ కిడ్నీలే ఒక్కోసారి శరీరం ఒప్పుకోదని.. అలాంటిది పందుల నుంచి అనేది అంత సులభమైన విషయం కాదని కూడా వీరు చెబుతున్నారు.
అయితే పందిగుండెను అమర్చుకున్న రోగి బెన్నెట్ ఈ ప్రయోగాత్మక చికిత్సకు ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఇది జరగకపోతే అతను చనిపోవడం ఖాయం. అందుకే గుండె జబ్బుతో చనిపోవడం కంటే ఇదే మేలు అనుకున్నాడు. అంతేకాదు అప్పటికే అతనికి అనేక రకాల చికిత్సలు జరిగినందున మనిషి గుండె దొరికే ఛాన్స్ లేదు. ఆపరేషన్ కు ముందు అతను గుండె-ఊపిరితిత్తుల బైపాస్ మెషీన్‌తో కనెక్ట్ చేసి ఉండేవాడు. ఆపరేషన్ తరువాత కూడా అది అలాగే ఉంచారు. మెల్లగా అతని గుండె పనిచేస్తూ ఈ మెషీన్ పనిని తగ్గిస్తూ వస్తోంది. ఈ రోజు వైద్యులు ఈ మెషీన్ తొలగించే అవకాశం ఉంది.