
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా 14 రోజుకు చేరుకుంది. యుద్దం ప్రారంభం నాటి నుంచి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నది. యుద్దాన్ని నిలిపివేయాలని ప్రపంచ దేశాలు రష్యాను కోరినా.. ఆ దేశం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రోజురోజుకు ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రం చేస్తున్నాయి రష్యాన్ సైన్యాలు.. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలను భేకరత్ చేసింది. రష్యా తలవంచేందుకు సిద్ధంగా లేకుంటే. మరోవైపు ఇలాంటి దాడితో చాలా దేశాలు రష్యాకు దూరమయ్యాయి. అయినా రష్యా తన దాడులను కొనసాగిస్తుంది. తొలుత.. ప్రభుత్వ కార్యక్రమాలు.. సైనిక స్థావరాలు, అణు ఉత్పత్తి కేంద్రాలపై దాడులు చేసిన రష్యా.. తాజా దారుణానికి తెగబడింది. కనీసం కనీకరం కూడా.. విక్షణ రహితంగా దాడులు పాల్పడ్డాయి రష్యా బలగాలు.
తాజాగా.. రష్యాన్ బలగాలు.. ఉక్రెయిన్‌లోని మారియుపోల్‌లోని ఓ చిన్న పిల్లల ఆస్పత్రిపై రష్యా సేనలు దాడులు చేశాయి. నేడు పీడియాట్రిక్, ప్రసూతి ఆసుపత్రిని దాడి చేశాయి. ఈ చిన్న పిల్లల ఆస్పత్రిపై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపించి... విధ్వంసం చేసింది. ఈ విషయాన్ని సిటీ కౌన్సిల్ ప్రకటించింది. అయితే దీని నష్టం పెద్ద స్థాయిలో ఉండే అవకాశముందని సిటీ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికి వరకు కనీసం 17 మంది గాయపడ్డారని స్థానిక అధికారి పావ్లో కైరిలెంకో తెలిపారు.
ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ట్విటర్‌లో పెద్ద మెడికల్ కాంప్లెక్స్‌లో భారీ విధ్వంసాన్ని చూపించే వీడియోను పోస్ట్ చేసారు.
ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని అజోవ్ సముద్రంలోని మారియుపోల్‌ను రష్యన్ దళాలు చుట్టుముట్టాయి, వారు పౌరులను ఖాళీ చేయడానికి కాల్పుల విరమణ హామీ ఇచ్చినప్పటికీ నగరంపై బాంబు దాడి చేశారు.
ఉక్రెయిన్ ప్రెసిడెండ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దేశంపై నో-ఫ్లై జోన్ విధించాలని మళ్లీ పిలుపునిచ్చారు. దీన్ని చేయడానికి NATO నిరాకరించింది.
బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కూడా దాడిని ఖండిస్తూ ఇలా అన్నారు: "దుర్బలమైన, రక్షణ లేని వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం కంటే మరోక దుర్మార్గమైన విషయం లేదని ప్రస్తవించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని వల్ల న్యూక్లియర్ ప్లాంట్‌లో కూలింగ్ వ్యవస్థలకు ప్రమాదం పొంచి ఉందని ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. పవర్ కట్ వల్ల డీజిల్ లేక జనరేటర్లు పని చేయకపోతే కూలింగ్ వ్యవస్థలపై ప్రభావం పడుతుందన్నారు. దీని వల్ల రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది.
ఇదే తరుణంలో ..రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయిన్‌లోని పలు నగరాలల్లో రష్యా సైన్యం సృష్టించింది. ఈ క్రమంలో ఒక మారియుపోల్ నగరంలోనే కనీసం 1,170 మంది పౌరులు మరణించారని ఉక్రేనియన్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ బుధవారం తెలిపింది, మారియుపోల్ డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. కనీసం 1,170 మంది మరణించారు, 47 మందిని సామూహిక సమాధిలో పాతిపెట్టారని డిప్యూటీ మేయర్ సెర్హి ఓర్లోవ్ ఉటంకించారు. ప్రజలు నీరు, వేడి, విద్యుత్, గ్యాస్ లేకుండా ఉన్నారు, రష్యా సేనలు గత 24 గంటలుగా భీకర దాడులు చేస్తున్నాయని మేయర్ వాడిమ్ బోయిచెంకో చెప్పారు.రష్యా దాడితో మారియుపోల్ నగరంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ అంతరాయం కారణంగా కనీసం ఫోన్లు కూడా పనిచేయడం లేదని పౌరులు ఆవేదనతో చెప్పారు.