
ఫోటో వీడియో షేరింగ్ ఆప్ ఇంస్టాగ్రామ్ తన సొంత వీడియో అప్లికేషన్ ఇంస్టాగ్రామ్ ఐజిటీవీ (IGTV)ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో రెండు app servicesను క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. Instagram వీడియో అప్లికేషన్ Boomerang, Hyperlapse లను గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ మూడింటిని ప్లే స్టోర్ లో నుంచి ఏక కాలంలో తొలగిస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇన్ స్టా గ్రామ్ ప్రధాన అప్లికేషన్లోని వీడియో యాప్ లో ఉన్న అన్ని ఫీచర్స్ ను అందుబాటులోకి తెస్తుంది. యాప్ లో ఈ మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఈ మూడు సర్వీసులను మూసివేసినట్లు తెలుస్తోంది. ఇంస్టాగ్రామ్ వీడియో అప్లికేషన్ బూమరాంగ్ ను 301 మిలియన్ల మందికిపైగా డౌన్లోడ్ చేసుకోగా hyperlapse యాప్ ను 23 మిలియన్ల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. బూమరాంగ్ యాప్ సర్వీస్ ను మూసి వేసే ముందు రోజే 26 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారని ఓ నివేదిక పేర్కొంది. వీడియోలు సృష్టించడానికి వినియోగదారుల కోసం ప్రత్యేకంగా సినిమాటోగ్రాఫిక్ ఎఫెక్ట్ ని సృష్టించడానికి హైపర్ లాప్స్ యాప్ ను ఇంస్టాగ్రామ్ తీసుకువచ్చింది.