నా పిల్లలు రాక్షసులు.. వారిది పాము డీఎన్ఏ.. చంపేసిన తండ్రి..!

Published : Aug 14, 2021, 12:46 PM ISTUpdated : Aug 14, 2021, 01:57 PM IST
నా పిల్లలు రాక్షసులు.. వారిది పాము డీఎన్ఏ.. చంపేసిన తండ్రి..!

సారాంశం

తన భార్య  ను ఇంట్లోనే వదిలేసి ఇద్దరు పిల్లలను తీసుకొని బయలుదేరాడు. అయితే.. భార్య ఎంత వద్దని  వారించినా.. వినకుండా.. ట్రిప్ కి తీసుకువెళ్తున్నట్లు చెప్పడం గమనార్హం.  

కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాల యముడయ్యాడు. అపురూపంగా చూసుకోవాల్సిందిపోయి.. దారుణంగా ప్రవర్తించాడు. ఇద్దరు బిడ్డలను అతి దారుణంగా చంపేశాడు. పైగా.. తన ఇద్దరు బిడ్డలు.. రాక్షస జాతికి చెందినవారంటూ .. వారిది పాము డీఎన్ఏ అంటూ చెప్పడం గమనార్హం. వారిని  చంపడం తప్పు అని తనకు తెలుసని.. కానీ.. సమాజ శ్రేయస్సు కోసమే తాను ఇలా చేశానని చెప్పడం గమనార్హం. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాకు చెందిన కోల్ మన్ అనే వ్యక్తి  తన రెండేళ్ల, పది నెలల వయసు ఉన్న ఇద్దరు బిడ్డలను అతి కిరాతకంగా హత్య చేశాడు. పిల్లలు ఇద్దరినీ మెక్సికో తీసుకువెళ్లి మరీ అక్కడే చంపేయడం గమనార్హం. ఆగస్టు 7వ తేదీన కోల్ మన్  తన భార్య  ను ఇంట్లోనే వదిలేసి ఇద్దరు పిల్లలను తీసుకొని బయలుదేరాడు. అయితే.. భార్య ఎంత వద్దని  వారించినా.. వినకుండా.. ట్రిప్ కి తీసుకువెళ్తున్నట్లు చెప్పడం గమనార్హం.

ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. మెసేజ్ చేసినా అతను స్పందించలేదు. దీంతో.. అనుమానంతో  ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో.. వెంటనే అతని ఫోన్ ట్రాక్ చేసి.. చివరగా ఎక్కడ ఉన్నాడో కనుక్కున్నారు. అక్కడకు వెళ్లి అతనిని అదుపులోకి తీసుకోగా.. పిల్లలు ఇద్దరినీ తుపాకీతో కాల్చి చంపినట్లు అంగీకరించడం గమనార్హం.

తన పిల్లలు రాక్షసులుగా ఎదుగుతారని తనకు అనిపించిందని అందుకే చంపానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?