మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియాకు చేదు అనుభవం.. ‘స్త్రీలంతా మాంసపు ముద్ద’లంటూ కామెంట్స్...

By AN TeluguFirst Published Aug 14, 2021, 9:37 AM IST
Highlights

ఆ గ్రూపులోని వారు ‘స్త్రీలు మాంసపు ముద్దలు’ అని మహిళల గురించి మాట్లాడుకోవడం షాకింగ్ కి గురిచేసిందని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు వాళ్లు మహిళలను లైంగికంగా, కించపరుస్తూనే ఉన్నారు. వారి ఈ సెక్సిస్ట్ ప్రవర్తన మీద వారిని నివారించాలని ఆమె నిర్ణయించుకున్నప్పుడు.. ఆమె కామెంట్ కి ఒక అబ్బాయి మాత్రమే స్పందించాడు.

మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా మరియా తటిల్ కు షాకింగ్ అనుభవం ఎదురయ్యింది. ఈ మధ్య ఆమె అనుకోకుండా ఓ 19 ఏళ్ల పురుషుల వాట్సాప్ గ్రూప్‌లో చేర్చబడింది. అది తనకు ఓ భయంకర అనుభవాన్ని మిగిల్చింది. మహిళా సాధికారత, బాలికల హక్కులపై తరచుగా మాట్లాడే మరియా, ఆ గ్రూప్ లో అబ్బాయిలు మరో జెండర్ గురించి మాట్లాడుకునేది విని ఆశ్చర్యపోయింది. 

ఆ గ్రూపులోని వారు ‘స్త్రీలు మాంసపు ముద్దలు’ అని మహిళల గురించి మాట్లాడుకోవడం షాకింగ్ కి గురిచేసిందని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు వాళ్లు మహిళలను లైంగికంగా, కించపరుస్తూనే ఉన్నారు. వారి ఈ సెక్సిస్ట్ ప్రవర్తన మీద వారిని నివారించాలని ఆమె నిర్ణయించుకున్నప్పుడు.. ఆమె కామెంట్ కి ఒక అబ్బాయి మాత్రమే స్పందించాడు.

దీని గురించి ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో మరియా మాట్లాడుతూ, లింగవివక్ష అందరూ ఎదుర్కుంటారు. కానీ "లింగవివక్ష కారణంగా మహిళలు ఐదు రెట్లు ఎక్కువ క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడుతుంటారు" అని లింగ మూస పద్ధతులు, లింగ ఆధారిత వేధింపుల కారణంగా పురుషుల కంటే మహిళలు చాలా ఎక్కువగా బాధపడుతున్నారనే వాస్తవాన్ని.. ఆమె చెప్పుకొచ్చింది.  

పురుషులందరూ ఇలాగే ఉన్నారని తాను చెప్పడంలేదని,  అయితే ఇలాంటి వైఖరిని చాలా కొద్దిమంది మాత్రమే నిరసన తెలుపుతున్నారని కూడా ఆమె చెప్పింది. అంతేకాదు ఇలాంటి విషయాల మద నిశ్శబ్దంగా ఉండడం, ఇలాంటి వాటితో ఆత్మసంతృప్తి చెందడం ఈ పరిస్థితిని మరింత భయానకం అని చెప్పుకొచ్చారు.  ‘దీని గురించి నేను ఒకసారి ఒక అందమైన కోట్ చదివాను, కాబట్టి మీలో ఎవరైనా 'అందరు పురుషులూ అలాంటివారే’ అని వ్యాఖ్యానించే ముందు, అది ఒక సమస్య అని తెలుసుకోండి. పురుషులందరూ ఇలా మాట్లాడరు. మన కోసం పోరాడరు. అందుకే ఇలాంటి మగతనం అనే విషపూరితభావాలను సవాలు చేయండి. ఇవి ఒక్కరితో మొదలవ్వవు.. గ్రూప్ చాట్‌లో మొదలవుతుంది. సమాజాన్ని రక్తసిక్తం చేస్తుంది. దీన్ని ప్రశ్నించండి" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్ పెట్టింది.

28 ఏళ్ల మరియా హైస్కూల్‌లో తన అనుభవాల గురించి మాట్లాడుతూ... ‘నేను స్కూల్ లో కూడా వేధింపులకు గురయ్యాను. మాటలతో దాడి చేశారు. అబద్దాలు చెప్పారు.  కానీ ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదు. అది తప్పుగా ఒప్పుకోలేదు. ఇది సర్వ సాధారణం అన్నట్టుగా వారి ప్రవర్తన ఉండేది. అంతేకాదు అబ్బాయిలు కాబట్టి తామేం చేసినా కరెక్టే’ అని మరియా చెప్పుకొచ్చింది. 

'అబ్బాయిలు అబ్బాయిలే' లాంటి మాటలతో మహిళలపై వేధింపులను తేలిగ్గా చూసే ధోరణిని రూపుమాపాలి... ఈ వైఖరుల కారణంగా సమాజంలో స్త్రీ వ్యతిరేకత, ద్వేషం, అగౌరవం వృద్ధి చెందుతున్నాయని  మరియా అన్నారు. మరింత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఈ ఇలాంటి వ్యక్తులే మన విధానాలను రూపొందించే రాజకీయ నాయకులుగా ఎదగడం, బోర్డు రూమ్‌లలో కూర్చునేవాళ్లుగా మారడం, కాబట్టి అలాంటి సెక్సిస్ట్ ప్రవర్తన దీర్థకాలంలో తీవ్ర ప్రభావం చూపుతుంది.

అణచివేతకు గురైన, వేధింపులకు గురైన మహిళల నుండి తనకు అనేక సందేశాలు వచ్చాయని మరియా చెప్పారు. ఆమె ఈ సోషల్ మీడియా పోస్ట్ కు మహిళలు, పురుషులనుంచి అనేక మెసేజ్ లు వచ్చాయి. సెక్సిజంపై మాట్లాడటానికి మరియా చేసిన ప్రయత్నాలను వారు ప్రశంసించారు.
 

click me!